కురువ విద్యార్థిని విద్యార్థులకు 88 మంది కి ప్రోత్సాహక బహుమతులు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా కురువ సంఘము ఆధ్వర్యంలో పదవ తరగతి ,ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు 88 మందికి ప్రోత్సాహకాలు ఆదివారం పెద్దపాడు రోడ్ లో గల భీరప్ప దేవాలయం ఆవరణం నందుజిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు మెమొంటోలు , సర్టిఫికెట్, నగదు బహుమతి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు కే .కిష్టన్న , జిల్లా అధ్యక్షుడు పత్తికొండ శ్రీనివాసులు ముఖ్యఅతిథి రాష్ట్ర CpI నాయకులు కే . రామచంద్రయ్య, గుడిసె శివన్న, మాట్లాడుతూ విద్యార్థులు తమ భవిష్యత్తును ఉన్నతస్థాయి శిఖరాలను అధిరోహించేలా ఆలోచన విధానం ఉండాలని అలాగే ప్రతి విద్యార్థి ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, ప్రొఫెసర్, శాస్త్రవేత్తలు కావాలనే ఆలోచనలతో ముందుకెళ్లాలని, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చి తమ కుటుంబాలకు గౌరవం దక్కేలా విద్యార్థులు మెలగాలని, ఒకప్పటి గొర్రెల కాపరుల పిల్లలు నేడు ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులుకత్తి శంకర్ , పెద్దపాడు ధనుంజయ ,బి . వెంకటేశ్వర్లు, ఉరుకుందు రాయలసీమ విద్యార్థి సంఘము అధ్యక్షులు రవికుమార్ ,రమట సర్పంచ్ వెంకన్న సహాయ కార్యదర్శి దేవేంద్ర, పాలసుంకన్న,బి మల్లికార్జున మహిళా సంఘం అధ్యక్షురాలు లీలమ్మ నందిని ,బి .రామకృష్ణ ,పులన్న ,దివాకర్ ,హరిదాసు , బి .సి .తిరుపాలు ,తదితరులు పాల్గొన్నారు.