కర్నూలు లో విత్తన కంపెనీ ప్రతినిధులతో సమావేశం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం, కర్నూలు లో విత్తన కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం అయినది. ఈ సమావేశంలో ప్రముఖ పత్తి విత్తన కంపెనీలైన నూజివీడు, కావేరి ,యూఎస్ అగ్రి సైన్స్, మహికో, వేద, సింజంట, నాథ్ మొదలగు కంపెనీల యొక్క ప్రతినిధులు హాజరవడం జరిగినది. ఈ సమావేశంలో ముఖ్యంగా పత్తి విత్తనాల యొక్క కృత్రిమ కొరతను సృష్టించకుండా కంపెనీ ప్రతినిధులు రోజువారి అమ్మకపు వివరాలు ,ప్రొడక్షన్ ప్లాన్ ప్రకారం విత్తనాల సరఫరా మొదలగునవి తూచా తప్పకుండా పాటించవలెనని లేనిచో అట్టి కంపెనీలపై విత్తన చట్ట ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకొనబడునని హెచ్చరించడమైనది. అంతేకాకుండా గరిష్ట అమ్మకపు ధర కంటే ఎక్కువ ధరకు విక్రయించినచో అట్టివారిపై చర్యలకు వెనుకాడబోమని జిల్లా వ్యవసాయ అధికారి కంపెనీ ప్రతినిధులకు ఆదేశించడ మైనది. ఈ సమావేశంలో ఐదు సబ్ డివిజన్లకు చెందిన సహాయ వ్యవసాయ సంచాలకులు మరియు సాంకేతిక వ్యవసాయ అధికారి పాల్గొనడం జరిగినది.