ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు..
1 min readకౌతాళం మండలం ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి
ఎన్నికల ముగిసే వరకు పెట్రోల్
డీజిల్ బాటిలలో నింపితే కఠినమైన చర్యలు
జూన్ 16 వరకు ఎన్నికలు ఆంక్షలు పాటించాల్సిందే
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు
ఓట్లు లెక్కింపు అయ్యేవరకు అందరూ సహకరించాలి
పల్లెవెలుగు వెబ్ కౌతాళం : కౌతాళం మండల కేంద్రమైన వివిధ గ్రామాల నుంచి వచ్చేవారు పెట్రోల్ ,డీజిల్ వాహనాలను మాత్రమే నింపాలని పెట్రోల్ బంకు యజమానులకు మండల ఎస్సై నరేంద్ర కుమార్ హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ జూన్ 4వ తేదీ ఓట్లు లెక్కింపు ఉన్నందున ఏ పెట్రోల్ బంకులో కూడా జూన్ 16వ తేదీ వరకు కాలి బాటిల్ లో పెట్రోల్ డీజిల్ వెయ్యరాదని హెచ్చరించారు. ఎవరైనా నిబంధన ఉల్లంఘించిన వారిపై పెట్రోల్ బంకు యజమానుల లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుంది. అని అన్నారు. గ్రామాలలో ఎన్నికల కౌంటింగ్ వరకు ఎలాంటి గొడవలు పాల్పడుకుండా అందరూ సహకరించాలని, ఎవరైనా ఎన్నికల నిబంధన ఉల్లంఘించి న వారిపై 144 సెక్షన్ కింద కేసులు నమోదు చేసి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.