డ్రెయినేజీ పైపుల ద్వార.. బంగ్లాదేశీయుల చొరబాటు
1 min readపల్లెవెలుగు వెబ్: పాస్ పోర్ట్ లేకుండా డ్రైనేజీ పైపుల ద్వార భారత్ లోకి అక్రమంగా చొరబడ్డ బంగ్లాదేశీయుల్ని పోలీసులు పట్టుకున్నారు. డ్రైనేజీ పైపుల ద్వార దేశంలోకి చొరబడి.. బెంగాల్ లోని హావ్ డా నుంచి రైళ్లలో ప్రయాణించి ఆంధ్రప్రదేశ్ చేరుకున్నట్టు విజయవాడ పోలీసులు తెలిపారు. కేంద్ర నిఘా విభాగం ఇచ్చిన సమాచారంతో ఎనిమిది మంది బంగ్లాదేశీయుల్ని విజయవాడ ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు బంగ్లాదేశీయుల్ని విజయవాడ సత్యానారాయణపురం పోలీసులు విచారిస్తున్నారు. హావ్ డా – వాస్కోడిగామా రైళ్ల నుంచి వస్తున్న వీరికి ఎలాంటి ధృవపత్రాలు లేకపోవడంతో పోలీసులు అరెస్టు చేశారు. 2017 నుంచి 2019 వరకు గోవాలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. బెంగళూరు చిరునామాతో ఫేక్ పాస్ పోర్ట్, ఫేక్ ఐడీ, ఫేక్ ఆధార్ తో ఉన్నట్టు తెలిపారు. బంగ్లాదేశీయుల్ని ప్రాథమికంగా విచారించినట్టు.. మరింత సమాచారం కోసం విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.