గొడవలు వద్దు..ప్రశాంత జీవితమే చాలు : సీఐలు
1 min readదేవనూరు,చౌటుకూరులో పోలీసులు కవాతు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: చిన్న చిన్న విషయాలకు గొడవలు వద్దని వాటి వల్ల జీవితాలు నాశనం అవుతాయని ప్రశాంతంగా జీవనం ఉంటే కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారని నందికొట్కూరు పట్టణ రూరల్ సీఐలు ప్రకాష్ కుమార్,విజయ భాస్కర్ అన్నారు.బుధవారం సాయంత్రం నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని దేవనూరు,చౌటుకూరు గ్రామాల్లో మిడుతూరు ఎస్ఐ జగన్ మోహన్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు.వచ్చేనెల 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉందని ఆ రోజున వెలువడే ఫలితాల్లో ఎలాంటి సంబరాలు టపాకాయలు కాల్చడం వంటిది అనుమతి లేదని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే జరిగే నష్టాల గురించి సీఐ లు ప్రజలకు అవగాహన కల్పించారు.ముందుగా గ్రామంలోని పుర వీధుల్లో మొత్తం 31 మంది సిబ్బందితో పోలీసులు కవాతు నిర్వహించారు.వివాదాలకు దూరంగా ఉంటూ శాంతియుతంగా ఉండాలని రౌడీ షీటర్లు నేర చరిత్ర కలిగిన వ్యక్తుల పట్ల నిఘా ఉంచామని జిల్లాలో 30 యాక్ట్ అమలులో ఉందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సైలు నాగార్జున,జయశేఖర్, లక్ష్మీనారాయణ ముచ్చుమర్రి ఎస్సై జయ శేఖర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.