జిల్లా ఖజానా శాఖ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ
1 min readఖజానా శాఖ అనేక సేవా కార్యక్రమాలు
వేసవి దృశ్య చల్లటి మజ్జిగ, మంచినీరు వందలాదిమంది కి పంపిణీ
ఏపీ ఎన్జీవోస్ సంఘ సభ్యులను అభినందించిన
డిడి టి కృష్ణ , ఏటిఓ ఎస్ శ్రీవిద్య
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : స్థానిక జిల్లా పరిషత్ ఎదురుగా జిల్లా ఖజానా శాఖ (ఏలూరు) వారి ఆధ్వర్యంలో గురువారం చల్లటి మజ్జిగ, మంచినీరు వందలాదిమంది పాదచారులకు, వాహనదారులకు, బస్సు ప్రయాణికులకు, ఆటో ప్రయాణికులకు వ్యాపారస్తులకు దాహార్తి తీరుస్తూ సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఖజానా శాఖ జిల్లా ఉపసంచాలకులు టి కృష్ణ మాట్లాడుతూ సమాజానికి మనిషిగా మానవత్వంతో ప్రతి ఒక్కరు సమాజసేవ నిర్వహించాలన్నారు. ఏపీ ఎన్జీవో ఆధ్వర్యంలో ప్రతి ప్రభుత్వ శాఖ వారు ప్రజల్లో ఉంటూ ప్రజల ఆరోగ్యాన్ని శ్రద్ధ చూపటంలో ముందుంటారు అన్నారు. మండుతున్న ఎండలు కి ప్రజలు అల్లాడిపోతున్నారని జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు ఇటువంటి మంచి సేవ కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయమన్నారు. ఏపీ ఎన్జీవోస్ అధ్యక్ష, కార్యదర్శు, కోశాధికారులను వారి సేవలను కొనియాడారు. రాబోయే రోజుల్లో ఇంకా అనేక సేవా కార్యక్రమాలు ప్రజలకు సేవలు అందించడమే మా ప్రధాన ధ్యేయం అన్నారు. కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. సేవ కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారంటూ పలువురు ప్రశంసలు తెలియజేశారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి నేరుసు వెంకట రామారావు, జిల్లా ట్రెజరీ సెక్రటరీ కె సత్యనారాయణ, గోర్ని శ్రీధర్ రాజు, నెరసు గణేష్ రావు, పూడి శ్రీనివాస్, ఖజానా శాఖ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.