ఓట్ల లెక్కింపులో టిడిపి దే ఘనవిజయం..
1 min readగెలుపులో బీసీలు కీలక పాత్ర పోషించారు.
చంద్రబాబుకు బీసీలు గిఫ్టుగా అభ్యర్థుల గెలుపు.
పల్లెవెలుగు వెబ్ కర్నూల్ : జూన్ 4న ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నారని బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు సత్రం రామకృష్ణుడు అన్నారు. ఈ రోజు 30-5-2024 వ తేది గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 13వ తేదీ జరిగిన పోలింగ్ లో అత్యధిక శాతం జిల్లాలో ఓట్లు పోలయ్యాయని తెలిపారు. గెలుపులో పోలింగ్ శాతం పెరగడం గెలుపుకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాలకు చంద్రబాబు నాయుడు సీట్లు కేటాయించి న్యాయం చేశారన్నారు.. ఒక ఎంపీ ఏడు ఎమ్మెల్యే స్థానాల్లో అభ్యర్థుల గెలుపులో బీసీలు కీలకంగా పని చేశారని గుర్తు చేశారు. అభ్యర్థుల ఘనవిజయం సాధించడంలో బీసీల దే కీలక పాత్ర అని తెలిపారు . గత మూడు నెలలుగా ప్రతి గ్రామం, మండలము, నియోజకవర్గ స్థాయిలో విస్తృత ప్రచారం చేసి అభ్యర్థుల గెలుపులో ఒక ప్రణాళికతో ప్రచారం కొనసాగించడం వల్లే పోలింగ్ శాతం పెరిగిందని తెలిపారు. ప్రతి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించి.. చంద్రబాబుకు జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా..ఈసారి జరిగిన గెలుపును .. గిఫ్ట్ గా ఇవ్వబోతున్నామని తెలిపారు.చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకంతో పాటు బీసీలకు రక్షణ చట్టం ఎంతో మేలు చేసిందని బీసీ సామాజిక వర్గం చంద్రబాబు వెంటే నడిచిందని తెలిపారు.అన్ని మతాలు కులాలకు సామాజిక న్యాయం, అభివృద్ధి ఒక్క చంద్రబాబు పాలనలోనే సాధ్యమని తెలిపారు.