పొగాకు ఉత్పత్తలను వాడడం ఆరోగ్యానికి హానికరం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: పొగాకు ఉత్పత్తలను వాడడం ఆరోగ్యానికి హానికరం” అని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్. డా. చిట్టి నరసమ్మ అన్నారు. “ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం” (NO tobacco Day, May 31st) ని పురస్కరించుకొని గురువారం కర్నూల్ మెడికల్ కళాశాల “కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్”, “ఎన్.ఎస్ఎస్” ఆధ్వర్యంలో కర్నూల్ మెడికల్ కాలేజీ గేట్ వద్ద నుండి ర్యాలి నిర్వహించడం జరిగింది..అనంతరం. కమ్యూనిటీ మెడిషన్ లో పోస్టింగ్ లో ఉన్న ఇంటర్న్స్ విద్యార్థులు కాలేజ్ గేట్ వద్ద వినూత్నంగా డమ్మి సిగరెట్లు తయారు చేసి పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే నష్టాలు స్లొగన్స్ లో చెబుతూ వాటిని కాల్చి వేయడం జరిగింది. అనంతరం “ప్లాష్ మాబ్” మరియు ఇంటర్న్స్ విద్యార్థులచే “ప్రపంచ ఆరోగ్య సంస్థ” 2024 సం.కు గాను “ప్రపంచ పొగాకు వ్యతిరేఖ దినం” ఉద్దేశం అయిన “పిల్లలను పొగాకు పరిశ్రమల జోక్యం నుండి కాపాడడం” అన్న సందేశాన్ని నాటిక రూపం లో ప్రదర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిషన్ డిపార్ట్మెంట్ ఇంచార్జి హెచ్.ఓ.డి & ప్రొఫెసర్ డా.సింధియా శుభప్రద మాట్లాడుతూ వైద్య విద్యార్థులు రాబోయే కాలంలో సమాజానికి ఆరోగ్యాన్ని అందించే వారని కావున వారు పొగాకు ఉత్పత్తులు విషయాల్లో జాగ్రత్త గా ఉండాలని ఎటువంటి చెడు అలవాట్లు కి లోను కాకూడదు అన్నారు. ఈ కార్యక్రమం లో వైస్ ప్రిన్సిపాల్ డా. సాయి సుధీర్, కమ్యూనిటీ మెడిషన్ డిపార్ట్మెంట్ ఇంచార్జి హేచ్.ఒ.డి & ప్రొఫెసర్ డా.సింధియా శుభప్రద, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్స్, పర్ల RHC సిబ్బంది, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.