నూతన రీడింగ్ హాల్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన.
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు : స్థానిక UG మెన్స్ మెడికల్ హాస్టల్ ఆవరణంలో నూతనముగా నిర్మించిన రీడింగ్ హాల్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన ప్రారంభించారు.గురువారం కర్నూలు మెడికల్ కాలేజి లో UG మెన్స్ మెడికల్ హాస్టల్ నూతన రీడింగ్ హాల్ ను ప్రారంభించిన అనంతరం వెబ్సైట్ (www.gghknl.in)ను లాంచ్ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన .జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన మాట్లాడుతూ నగరంలోని UG మెన్స్ మెడికల్ హాస్టల్ దాదాపు 500 మంది విద్యార్థులు ఉన్నారని. ఈ విద్యార్థుల కొరకు 35 లక్షల రూపాయల వ్యయముతో 120 మంది విద్యార్థులు ఒకేసారి హాల్లో కూర్చుని చదువుకునే వసతి కలిగిన ఏసి రీడింగ్ హాల్ ను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. విద్యార్థులు ఈ హాలును సద్వినియోగం చేసుకోవాలన్నారు. హాస్టల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సోలార్ పవర్ ఏర్పాటు, వెహికల్ షెడ్, తదితల సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు కలెక్టర్ గారికి అర్జీ సమర్పించారు.అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన కర్నూలు సర్వజన వైద్యశాల వెబ్సైట్ (www.gghknl.in) ను గతంలో ఉన్న ఈ వెబ్సైట్ ను AMMSON కంపెనీ బృందం వారిచే అత్యాధునిక టెక్నాలజీచే అప్డేట్ చేసి ఈరోజు లాంచింగ్ చేయడం జరిగిందన్నారు. ప్రజలకు అత్యవసరమైన సమాచారం కొరకు అవసరమైన పూర్తి సమాచారాన్ని ప్రజలకు అందించాలనదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఉన్నారు. ఈ వెబ్సైట్ ద్వారా సర్వజన వైద్యశాలలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏఏ డిపార్ట్మెంట్లో ప్రజలు ఎలాంటి వైద్య సేవలు పొందవచ్చును, వైద్యశాల ఆవరణంలోని అన్ని వివరాలను పూర్తి క్షుణ్ణంగా తెలుసుకోవచ్చునని కలెక్టర్ తెలియజేశారు.కార్యక్రమంలో జిజిహెచ్ సూపరిండెంట్ డా.వి.వెంకటరంగారెడ్డి, డా.ప్రభాకర్ రెడ్డి, డా.పద్మ విజయ శ్రీ, డా.రాధా రాణి, డా.హేమనలిని, డాక్టర్ సోమశేఖర్, డాక్టర్ మంజుల బాయ్, డాక్టర్ సీతారామయ్య, తదితరులు పాల్గొన్నారు.