కల్లూరులో విత్తన దుకాణాలు తనిఖీ
1 min readకర్నూలు, పల్లెవెలుగు: జిల్లా వ్యవసాయ అధికారి P.L.వరలక్ష్మీ , సహాయ వ్యవసాయ సంచాలకులు రెగ్యులర్ కర్నూలు N. సాలు రెడ్డి, మండల వ్యవసాయ అధికారి కల్లూరు B.శ్రీనివాస్ రెడ్డి మరియు సాంకేతిక వ్యవసాయ అధికారి దస్తగిరి రెడ్డి గురువారం కల్లూరు విత్తన దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహాలక్ష్మి సీడ్స్, రాయలసీమ సీడ్స్ ఇండియన్ సీడ్స్ దుకాణాలలో రికార్డులను తనిఖీ చేశారు. HT Strip టెస్ట్ ను ధనలక్ష్మి క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వేద సీడ్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అమర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ తులసి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు చెందిన పత్తి విత్తనాల యందు నిర్వహించడం జరిగింది. ఈ స్ట్రిప్ టెస్ట్ లో పైకంపెనీలకు సంబంధించిన పత్తి విత్తనాలలో HT లేదని నిర్ధారించడమైనది మరియు తనిఖీలో భాగంగా stocks & రికార్డులను వెరిఫై చేయగా వివిధ కంపెనీలకు చెందిన కూరగాయలు రకాలకు సంబంధించిన సరైన పత్రాలు చూపనందున మహాలక్ష్మి సీడ్స్ నందు రెండు లక్షల విలువైన విత్తనములను(బంతి, క్లస్టర్ బీన్స్, కాకర, బీర) 15.35 kgs-Rs.2,12,065/- తాత్కాలిక నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వడం జరిగినది మరియు డీలర్లు అందరికీ నాణ్యమైన విత్తనాలు నిర్దిష్టమైన ధరలకే రైతులకు అందజేయాలని లేనిచో తగిన చర్యలు తీసుకొనబడునని ఆదేశించడం అయినది. రైతు సోదరులకు తెలియజేయడమేమనగా అధికృత డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని దీనికి సంబంధించి బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలని మరియు విత్తనముల ప్యాకెట్లను కూడా భద్రపరుచుకోవాలని తెలియజేశారు.