దివ్యాంగులు పిల్లల నమోదుపై సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సర్వే
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలంలో దివ్యాంగ పిల్లల నమోదు ప్రక్రియ జరుగుతున్నదని ఈ సర్వే సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాలు మేరకు అలాగే చెన్నూరు మండల విద్యాశాఖ అధికారులు గంగిరెడ్డి. సునీత వారి సహకారంతో నిర్వహిస్తున్నట్లు చెన్నూరు భవిత కేంద్రం ఉపాధ్యాయురాలు టి శ్రీదేవి. జే . కళావతి తెలిపారు. శుక్రవారం చెన్నూరు కొండపేట గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో దివ్యాంగ పిల్లల నమోదు సర్వే నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ ఒక సంవత్సరం వయసు నుంచి 18 సంవత్సరాలు వయసుగల పిల్లలను గుర్తించి వారిని దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం జరుగుతుందని తెలిపారు అలాగే భవిత కేంద్రంలో బుద్ధి మందత్వ. వినికిడి లోపం. దృష్టిలోపం. శరబ్రాల్ పాలసీ. చలన వైకల్యం. మొత్తం 21 రకాల వైకల్యాలను గుర్తించి వారిని భవిత కేంద్రంలో చేర్పించడం జరుగుతుందన్నారు. దివ్యాంగ పిల్లలకు ప్రభుత్వం తరఫున సమగ్ర శిక్ష తరపున అన్ని రకాల అలవెన్స్ లు అందిస్తారన్నారు. భవిత కేంద్రంలో ప్రతి బుధవారం ఫిజియోథెరపీ డాక్టర్ చే ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. దివ్యాంగ పిల్లల నమోదు కార్యక్రమం జూన్ నెల 9వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు.