సామాజిక చైతన్యమే కళాకారుల ప్రధాన లక్ష్యం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు నగరం నందలి కోర్టు రోడ్ లో గల యునైటెడ్ క్లబ్ నందు కర్నూలు కళాకారులు, కందుకూరి పురస్కార గ్రహీత, కళాప్రియ తిరుపాలు 86వ జన్మదిన వేడుకలు కళాకారుల ఐక్యవేదిక ఉపాధ్యక్షులు పెనికలపాటి హనుమంతరావు చౌదరి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కళాకారులు కారణజన్ములని ప్రజా చైతన్యంలో కళలు మమేకమవ్వాలని సమ సమాజ నిర్మాణానికి కళాకారులు మార్గదర్శకులు కావాలని గౌరవాధ్యక్షులు సిహెచ్ చంద్రన్న క్రిస్టఫర్ సయ్యద్ రోషనలి కళాకారులకు చైతన్యపరిచారు. 86వ జన్మదిన వేడుకలు కళాకారుల ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా ఆనందదాయకమని మళ్లీ జన్మంటూ ఉంటే కళాకారుడు గానే పుడతానని కర్నూలు సీనియర్ కళాకారులు సుమధుర గాయకులు శ్రీ కళా ప్రియ తిరుపాల్ అన్నారు. కర్నూలు జిల్లా రంగస్థల కళాకారులు కళా సమాజాల ప్రతినిధులు కళాప్రియ తిరుపాలను అభినందించారు, జన్మదిన వేడుకలు తెలియజేశారు. ఈ జన్మదిన వేడుకల కార్యక్రమంలో ఐక్యవేదిక ఉపాధ్యక్షులు పెనికలపాటి హనుమంతరావు చౌదరి ఐక్యవేదిక సమన్వయకర్త బైలుప్పల షఫీయుల్లా కర్నూల్ నగరం నందు రంగస్థలం కళాకారులకు ప్రభుత్వ సహకారంతో రంగస్థలం పౌరాణిక సాంఘిక నాటకాలు ప్రదర్శనకు అవకాశం ఇవ్వాలని కళా ప్రియ తిరుపాలు అభిమానులు, సంగీత గురువులు వెంకటేశ్వర్లు, బీసీ నాయకులు కురువ నగేష్, యునైటెడ్ క్లబ్ సభ్యులు, సుధాకర్ గౌడ్, సవారన్న, కర్నూలు కళాకారులు టి రాజశేఖర్ రావు రామకృష్ణ శామ్యూల్ అరుణకుమారి వివి రమణారెడ్డి డి పుల్లయ్య డి పార్వతయ్య గడ్డం శ్రీనివాసులు పి.శక్షావలి నజీర్ అహ్మద్ అక్బర్ బాషా నాయుడు పాల్గొని పూలమాలలు వేసి అభినందనలు తెలియజేశారు.