మెడికల్ కళాశాలకు.. రీ ఎంట్రీ…
1 min read–మెడికల్ కళాశాల కార్డియాలజి ప్రొఫెసర్‌గా డా. చంద్రశేఖర్
– ఆనందం వ్యక్తం చేసిన కళాశాల సిబ్బంది
కర్నూలు, పల్లెవెలుగు: కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌గా, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వర్తించి.. ఎందరో మన్ననలు పొందిన రిటైర్డు కార్డియాలజిస్ట్ డా. చంద్రశేఖర్ … మెడికల్ కళాశాలలో కార్డియాలజి ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరారు. శనివారం అధికారికంగా ఆయన ఉద్యోగంలో చేరడంతో రిటైర్డు ప్రిన్సిపల్ , ప్రముఖ నెఫ్రాలజీ వైద్యురాలు డా. జిక్కి, కళాశాల సిబ్బంది, విద్యార్థులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఎందరో పేదలకు పున: జన్మ ప్రసాదించిన డాక్టర్‌గా గుర్తింపు పొందిన డా. చంద్రశేఖర్… మళ్లీ కళాశాల ప్రొఫెసర్‌గా విధుల్లో చేరడంతో మెడికల్ కళాశాల సిబ్బంది, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. రిటైర్డు అయిన తరువాత కూడా తాను మెడికల్ కళాశాల విద్యార్థులకు… రోగులకు వైద్య సేవ చేసేందుకు సంసిద్ధంగా ఉంటానని ఈ సంద్భంగా కార్డియాలజి ప్రొఫెసర్ డా. చంద్రశేఖర్ స్పష్టం చేశారు.