PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మానసిక ఒత్తిడితోనే..దీర్ఘకాలిక వ్యాధులు..

1 min read

సైకో సోమాటిక్​ వ్యాధులపై అవగాహన పెంచుకోండి..

  • డా. వైఎస్సార్​ యూనివర్శిటీ ఆఫ్​ హెల్త్​ సైన్స్​ రిజిస్ట్రార్​ రాధిక రెడ్డి
  • కర్నూలులో దక్షిణ భారత మానసిక వైద్యుల సదస్సు

కర్నూలు, పల్లెవెలుగు:మానసిక ఒత్తిడితోనే… శరీరంలో మార్పులు… దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయన్నారు డా. వైఎస్సార్​ యూనివర్శిటీ ఆఫ్​ హెల్త్​ సైన్స్​ రిజిస్ట్రార్​ రాధిక రెడ్డి. శనివారం నగరంలోని మౌర్య ఇన్​లో దక్షిణ భారత మానసిక వైద్యుల సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా డా. వైఎస్సార్​ యూనివర్శిటీ ఆఫ్​ హెల్త్​ సైన్స్​ రిజిస్ట్రార్​ రాధిక రెడ్డి, కర్నూలు ఎంపీ డా. సంజీవ్​ కుమార్​ పాల్గొన్నారు. కర్నూలు సైకియాట్రిక్​ సొసైటీ అధ్యక్షుడు , మానస హాస్పిటల్​ అధినేత డా. రమేష్​ బాబు, ఉపాధ్యక్షులు, ఆశాకిరణ్​ హాస్పిటల్​ అధినేత డా.బి. నాగిరెడ్డి నేతృత్వంలో   దక్షిణ భారత వైద్యుల సదస్సు జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డా .రాధిక రెడ్డి మాట్లాడుతూ సైకో సోమాటిక్​ వ్యాధులు మహిళల్లో అధికమయ్యాయని, హార్మోన్ల ఇన్​ బ్యాలెన్స్​ వల్ల ఈ వ్యాధులు వస్తున్నాయని స్పష్టం చేశారు.  ఈ వ్యాధిని త్వరగ గుర్తించి వైద్యం అందించాలని సూచించారు. అనంతరం ఎంపీ డా. సంజీవ్​ కుమార్​ మాట్లాడుతూ జీజీహెచ్​ సూపర్​ స్పెషాలిటీలో 19 పీజీ సీట్లు, 179 అసిస్టెంట్​ ప్రొఫెసర్ల పోస్టులు రావడానికి కృషి చేశానన్నారు.  సదస్సులో సౌత్​ జోన్​ ఇండియా అధ్యక్షుడు డా. అభయ్​ మట్కర్​, వైస్​ ప్రెసిడెంట్​ ఉమా శంకర్​, కార్యదర్శి డా. లోకేశ్వర రెడ్డి, సీఎంఈ చైర్​ పర్సన్​ పీఎస్​ వీఎన్​ శర్మ, ఏపీఎంసీ అబ్జర్వర్​ డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి, జాయింట్​ సెక్రటరీలు డా. హరిప్రసాద్​, డా. సుహృత్​ రెడ్డి, సైంటిఫిక్​ కన్వీనర్​ డా. శంకర్​ రెడ్డి, తమిళనాడు, తెలంగాణ, కేరళ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి మానసిక వైద్యులు పాల్గొన్నారు.


About Author