శాస్త్రీయ పద్ధతిలో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ..
1 min readజిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో
ఘన వ్యర్థ పదార్థాల నివారణ అంశం పై అవగాహన సదస్సు
పునరుత్పత్తి, శాశ్వత నిర్మూలన పై..ప్రజలు బాధ్యత యుతంగా నడుచుకోవాలి
రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇంజనీర్ కె వెంకటేశ్వరరావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి మరియు అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె.కె.వి.బులి కృష్ణ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనమనందు ఘన వ్యర్ధపదార్థాల నిర్వహణ అంశం పైన వివిధ అధికారులతో శనివారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఇన్చార్జి కార్యదర్శి మరియు అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె.కె. వి బులి కృష్ణ అతిథిలకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఘన వ్యర్ధపదార్థాలు, ప్లాస్టిక్, బయో మెడికల్ మొదలైన వ్యర్థాల నిర్వహణ అనగా సేకరించడం, పునరుత్పత్తి చేయడం మరియు పూర్తి నిర్మూల పై అందుబాటులో ఉన్న శాస్త్రీయత గురించి వివరించడం జరిగింది.అదనపు మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య మాట్లాడుతూ నగర ప్రజలను ఎప్పటికప్పుడు అవగాహన కలిగిస్తూ అందుబాటులను వనరులను ఉపయోగించుకుంటూ వ్యర్థ పదార్థాలను సేకరించి, వాటిని పునరుత్పత్తి చేయడం జరుగుతుందని. అలాగే నగర ప్రజలు కూడా సంస్థకు సహకరించవలసిందిగా కోరారు. రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇంజనీర్ కె.వెంకటేశ్వర రావు మాట్లాడుతూ వివిధ రకాల వ్యర్ధాలను సేకరించడం పునరుత్పత్తి చేయడం, శాశ్వత నిర్మూలన అంశాలపై ఉన్న శాస్త్రీయపరమైన విధివిధానాలను, వాటికి రూపొందించబడిన చట్టాలను కూలం కుష్ణంగా తెలియజేశారు. అలాగే ప్రజలు కూడా బాధ్యతాయుతముగా నడుచుకోవాలని, సంబంధిత సంస్థలకు సహకరించాలని కోరారు. డి ఎం హెచ్ ఓ డిప్యూటీ డెమో నాగరత్నం మాట్లాడుతూ వివిధ వ్యర్ధాలను శాస్త్రీయ పరంగా నిర్మూలించాలని లేదా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతారని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానల్ అడ్వకేట్ కూనా కృష్ణారావు మాట్లాడుతూ వ్యర్థ పదార్థాలను సరైన రీతిలో ఉపయోగించుట ద్వారా ఆదాయ వనరులుగా సృష్టించవచ్చని కావున అందుబాటులో ఉన్న వనరులను గుర్తించి అభివృద్ధి చేయాలని కోరారు. తదనంతరం ఏపీ పొల్యూషన్ బోర్డు వారు జ్యూట్ బ్యాగులను పంపిణీ చేయడం జరిగింది మరియు కార్యక్రమములో వివిధ హాస్పిటల్స్, పరిశ్రమల ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, పంచాయతీ అధికారులు మరియు వివిధ శాఖల అధికారులందరూ పాల్గొన్నారు.