ఉమ్మడి కర్నూలు జిల్లాలో గెలుపొందిన కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు శుభాకాంక్షలు
1 min readరాష్ట్ర ప్రజలు మార్పు కోసం కూటమి అభ్యర్థులను ఎన్నుకున్నారు.
రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డి ప్రభుత్వానికి చరమగీతం పాడారు.
కూటమి విజయానికి జనసేన పార్టీ కీలక పాత్ర పోషించింది.
జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింత సురేష్ బాబు.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సందర్భంగా బుధవారం రోజున స్థానిక జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో జనసేన జిల్లా నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింత సురేష్ బాబు మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో గెలుపొందిన కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోసం జనసేన పార్టీ గత మూడు సంవత్సరాల నుండి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడి ఆలోచించి ఓటు వేశారని వారికి కృతజ్ఞతతో రుణపడి ఉంటామని అన్నారు. పవన్ కళ్యాణ్ రూపొందించిన వ్యూహం సక్సెస్ అయిందని జగన్ రెడ్డి ప్రభుత్వానికి చరమగీతం పాడడానికి, కూటమి విజయానికి జనసేన పార్టీ కీలక పాత్ర పోషించిందని చెప్పుకొచ్చారు. 2019లో కనివిని ఎరుగని రీతిలో ప్రజలు వైసిపి కి 151 స్థానాలను కట్టబెట్టారని ఐదేళ్ల పాలనలో జగన్ చేసిన అరాచకాలను దోపిడీలను ఈరోజుతో అడ్డు కట్ట పడిందని 11 స్థానాలకే ప్రజలు పరిమితం చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం లో ప్రజలకు మంచి చేసే దిశగా మంచి పాలన అందిస్తామని పేర్కొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వెంకప్ప, మంజునాథ్, బజారి, సుధాకర్, సుమలత షబ్బీర్, సతీష్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.