మాలో తప్పులుంటే సరి చేసుకుంటాం..
1 min read-మా కార్యకర్తలపై దాడులు చేస్తున్న టిడిపి
-కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటా
-పథకాలు ప్రజలకు చేరని పక్షంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం
-రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాజకీయాల్లో గెలుపోటములు సహజం ఎన్నికల్లో మా ఓటమి గురించి మాలో ఏమైనా తప్పులుంటే మేమంతా కూర్చుని వాటిని సరి చేసుకుంటాం..మేమంతా అంతర్గతంగా చర్చించి వాటిపైన సరైన నిర్ణయం త్వరలో తీసుకుంటామని రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో గురువారం మ.12 గంటలకు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము నిజాయితీగా పని చేశాం ప్రజల అభివృద్ధి కోరుకున్న ప్రజలు మమ్మల్ని ఇష్టపడాలనే రాజకీయం చేసినాం తప్పా రాజకీయాలనుండి మేము సంపాదించాలని ఎప్పుడూ కూడా రాజకీయాలు చేయలేదు.నా శ్వాస ఉన్నంతవరకు కార్యకర్తల కోసం పోరాడుతా రాబోయే రోజుల్లో కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని టిడిపి అధికారంలోకి వచ్చి రాగానే రాష్ట్రంలో మా కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ప్రజలను నాయకులను కార్యకర్తలను భయపెట్టాలని కొంతమంది చూస్తున్నారని వాళ్లు ఆ పద్ధతి మార్చుకోవాలన్నారు.ఇవన్నీ మేము ఊహించనిది కాదు మేము కొత్తగా చూస్తున్నది కాదు.వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మేము ఒక్కరి పైనా కూడా దాడులు చేయలేదని మున్సిపాలిటీ పరిధిలో ఎంతో అభివృద్ధి చేశామనేది వాళ్ళు తెలుసుకోవాలన్నారు. రాజకీయాల్లో అవినీతి డబ్బు సంపాదించాలి కాంట్రాక్టర్లను బెదిరించి కమిషన్లు భూకబ్జాలు చేయాలని మేము ఎప్పుడు రాజకీయాలు చేయలేదని అనేది ప్రజలకు వివరిస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రజల్లోకి బలంగా వెళ్తాం కొత్త ప్రభుత్వం వాళ్లు అందించే పథకాలను ప్రజలకు ఏ విధంగా చేరుతున్నాయి అనేది వాటిపైన మేము పోరాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని సిద్ధార్థ రెడ్డి అన్నారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి,వైసీపీ నాయకులు వై చంద్రమౌళి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి,జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి,వైసీపీ నాయకులు తువ్వా చిన్న మల్లారెడ్డి,తువ్వా లోకేశ్వర్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు మన్సూర్,మోమిన్ మన్సూర్, నాగ తులసి రెడ్డి మరియు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.