చెన్నూరు వద్ద పెన్నా నది భారీగా నీటి ప్రవాహం
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: గత మూడు రోజులుగా కడప. నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో పెన్నా నది ఎగువ ప్రాంతంలో ఉన్న కుందూ నదికి భారీగా వరద నీరు చేరడంతో కుందూ నది నుంచి పెన్నా నదిలోకి వరద నీరు చెబుతున్నది. చెన్నూరు వద్ద శనివారం ఉదయం నుంచి భారీగా నీటి ప్రవాహం పెరుగుతున్నది. చెన్నూరు వద్ద కేంద్ర సెంట్రల్ వాటర్ కమిషన్. అది నిమ్మాయిపల్లి ఆనకట్ట వద్ద కేసీ కెనాల్ అధికారులు నీటి ప్రవాహాన్ని అంచనా వేస్తున్నారు. శనివారం సాయంత్రానికి పెన్నా నదిలో5780 క్యూసెక్కులు నీరు దిగవనున్న సోమశిల ప్రాజెక్టులకి పరుగులు పెడుతున్నది. నంద్యాల జిల్లా నంద్యాల కోయిలకుంట్ల బనగానపల్లి ఆర్లగడ్డ. కడప జిల్లా జమ్మలమడుగు ప్రొద్దుటూరు దువ్వూరు రాజుపాలెం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో వరద నీరంతా కుందునది ద్వారా పెన్నా నదిలోకి చేరుతున్నది. చెన్నూరు వద్ద నేటి ప్రవాహం పెరుగుతున్నది.