జగన్ ముంచేశాడు.. వైసిపి నాయకులు ప్రజల మధ్య వాలంటీర్లు అగాధం..
1 min readపల్లెవెలుగు న్యూస్ గడివేముల: గత ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనపై గతంలో ప్రశంసలు కురిపించిన వైసిపి ఎమ్మెల్యేలు 2024 ఎన్నికల్లో ఓడిపోయాక మెల్లిగా బయటికి వచ్చి తమ నిరసన గళం వినిపిస్తున్నారు .జగన్ ముంచేసాడు అని సలహాదారుల వాలంటీర్ మాయలో తమను నిర్లక్ష్యం చేశాడని ప్రజలు నాయకుల మధ్య వాలంటీర్ అగాధాన్ని సృష్టించి తమకు ప్రజలు కనెక్ట్ కాకుండా చేశారని. సొంత పార్టీ వారే ఆరోపించడం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది . కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టు వైసిపి నేతల నిర్లక్ష్య ధోరణి చెప్పుడు మాటలు కొన్ని వర్గాలకు దూరం చేశాయి ముస్లిం మైనార్టీలకు ప్రత్యేకంగా ఏ పథకం ఇవ్వకుండా ఇచ్చిన పథకానికి సవాలక్ష కొర్రీలు పెట్టి జగనన్న పెళ్ళికానుక అంటూ అందని పథకంగా మార్చేశారు ఇదిలా ఉంటే కార్పొరేషన్లకు డైరెక్టర్ పదవులు ఇచ్చినంత మాత్రాన సామాజిక వర్గం జీవన విధానం ఎటువంటి మార్పు లేకుండా ఉండిపోవడం పెద్ద మైనస్ కూల్చివేతలతో మొదలైన పాలన అలివి కాని నిర్ణయాలు అవసరంలేని పథకాలు ఇచ్చి విద్యుత్ బిల్లులు సాండ్ పాలసీ మద్యం పాలసీ ప్రభుత్వాన్ని ఆదాయం తెచ్చే రెవెన్యూ స్టాంప్ రిజిస్ట్రేషన్ ఇటువంటి వాటిపై దృష్టి పెట్టకపోవడం అప్పులు తెచ్చి ఐదు సంవత్సరాలు పాలన చేయడం నాసిరకం మద్యం ఇవన్నీ జగనన్న పాలనలో మైనస్. గెలుస్తామన్న ధీమా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు గెలిపిస్తామని హామీ ఇచ్చే ప్రజలు కంటికి కనపడకుండా పోయారు ఎన్నికల ప్రచారాలకు బహిరంగ సభ కు వచ్చిన ప్రజలే ఓటు వెయ్యలేదు అన్నది నిజం.. ఇళ్లకు స్టిక్కర్లు వేయడం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. జగనన్న భూ సమగ్ర సర్వే. హద్దురాళ్లపై జగన్ బొమ్మ వేసుకోవడం రైతులకు నచ్చలేదు. ఇక గతంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థ మీద విమర్శలు చేస్తే దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు మరి ఓడిపోయిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వాలంటీర్ వ్యవస్థ పై బహిరంగ విమర్శలు చేస్తున్నారంటే వ్యవస్థలోని లోపాలను ఏమాత్రం దుర్వినియోగం చేశారో అర్థమవుతుంది.. ఒక్క పింఛన్లు తప్పితే వాలంటీర్లు ఎటువంటి సేవ చేయాలేదన్నది బహిరంగ నిజం. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలందరికీ నవరత్నాలు అంటూ సంక్షేమం ఐచ్చి అభివృద్ధి అనే నినాదాన్ని మర్చిపోయి నీటిపారుదల శాఖ మీద నిర్లక్ష్యం వహించడం రహదారులు గుంతలమయంగా మారడం నిర్లక్ష్యం కాదా అందులో పడి ఎంతోమంది ప్రజలు చనిపోవడం గాయాల పాలవడం అర్బన్‌లలో.భూ కబ్జాలు తదితర ఆరోపణలు శృతిమించి పబ్లిసిటీ అయ్యాయి. నిర్భయంగా నిజాలను మాట్లాడిన జర్నలిస్టులపై దాడులు చేయడం నిజం కాదా. వీపులు పగులుతాయని చెప్పడం . ప్రతి 50 కుటుంబాల సమాచారం సేకరించిన వాలంటీర్లు ఆ తర్వాత ఇండ్ల వైపే చూడడం మానేసి లబ్ధిదారులపై నాయకుల వద్ద చాడీలు చెప్పడం నిజం కాదా గ్రామాలలో అలివేకాని చోట జగనన్ కాలనీలు అంటూ పబ్లిసిటీ చేసుకొని మురిసిపోయింది నిజం కాదా. మూడు రాజధానులు అంటూ ఇష్టం లేని వాటిని ప్రజలపై రుద్దడం మంత్రులుగా అర్హత లేని వారి నీ తీసుకొని అభివృద్ధి చేస్తాం అని చెప్పకుండా ఎప్పుడు మూడు పెళ్లిళ్లు ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ కాలం గడపడం . పోలవరం ప్రాజెక్టుపై అబద్ధాలు చెప్పడం. అసెంబ్లీలో బూతులు మాట్లాడటం. చిన్న పాటి కేసుకి చంద్రబాబును అరెస్టు చేసి జైలులో వేయడం మైనస్ వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు గడపగడప అంటూ చెమట చుక్కలు రాల్చిన ప్రజలు తిరస్కరించారు .. మొత్తానికి వైసిపి నాయకులు కష్టపడ్డ అభివృద్ధి పథకాలను ప్రజల్లో తీసుకెళ్లడం కంటే ప్రతిపక్షాలపై విమర్శలు చేయడమే సోషల్ మీడియాలో మరి శృతి మించి విమర్శలు చేసిన నాయకులను కట్టడి చేయకపోవడం పెద్ద మైనస్.. ఇక ఓడిపోకుండా గెలుస్తారా మరి.. నన్ను చూసి ఓటు వేశారన్న జగన్మోహన్ రెడ్డి. ప్రజలను మభ్యపరచలేకపోయాడు .