అక్రమ డొనేషన్లు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
1 min readప్రైవేట్ పాఠశాలల్లో చేరాలంటే ప్రవేశపరీక్ష ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయలా??
చదువుని పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మారుస్తున్న ప్రైవేట్ పాఠశాలలు
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణం లోనే తహసిల్దార్ కార్యాలయంలో ఎస్ ఎఫ్ ఐ, పి డి ఎస్ ఓ, ఆర్ ఏ వీ ఎఫ్, ఆర్ యు ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మార్వో శేషారెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు ఖాజా సురేంద్ర కృష్ణ విజయ్ రఘునాథ్ మాట్లాడుతూ పట్టణంలోనే ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థి తల్లిదండ్రుల నుండి వేలకు వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ అడ్మిషన్ ఫీజు పేరుతో డొనేషన్లు సైతం వసూలు చేస్తున్నారు అలాగే జీవో నెంబర్ 1 ని ఉల్లంఘించి పాఠశాలల్లోనే బుక్స్ బాగ్స్ షూస్ అమ్ముతూ పాఠశాలల్ని వ్యాపార కేంద్రంగా మార్చారు అని ఆవేదన వ్యక్తం చేశారు విద్యాశాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్లు చూడనట్లు వ్యవహరించి కార్పొరేట్ పాఠశాలలకు వత్తాసు పలుకుతున్నారు అని అన్నారు ఇకనైనా విద్యాశాఖ అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలో చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.