శ్రీ పెద్దింటి అమ్మవారిని దర్శించుకున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
1 min readఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికిన కార్యనిర్వహణ అధికారి కె వి కొండలరావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : కైకలూరు మండలం, కొల్లేటికోట గ్రామం లో వేంచేసియున్న శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానందు ఈరోజు ఆదివారం అయినందున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించుకొని వారి వారి మ్రొక్కుబడులను చెల్లించుకొని, నైవేద్యములు సమర్పించుకొని తదుపరి తీర్ధ ప్రసాదములు స్వీకరించి యున్నారని, భక్తులకు ఏవిదమైన అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి వారు తగిన ఏర్పాట్లను చేయించియున్నరని, తదుపరి ఏలూరు నియుజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మరియు ఏలూరు వాస్తవ్యులు మద్యహనపు బలరామ్ శ్రీ అమ్మవారి దర్శనార్థమై విచ్చేసి యున్నారు, వారిని ఆలయ కార్యనిర్వహణాధికారి కె.వి. గోపాల రావు అతిధి మర్యాదలతో ఆహ్వానం పలికి ఆలయ అర్చకులచే వేద మంత్రలతో విశేష పూజా కార్యక్రమములు జరిపించి శేషవస్త్రాములతో, ఫులదండలతో సత్కారించి ఆశీర్వచనం అనంతరం తీర్ద ప్రసాదములు అందజేసినరని ఆలయ కార్యనిర్వాహణాధికారి కె. వి. గోపాలరావు ఒక ప్రకటనలో తెలియజేసినారు. ఈ సందర్భంలో ఆలయ ఉప ప్రధాన అర్చకులు పెటేటి పరమేశ్వర శర్మ , మరియు అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.