PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కిమ్స్ స‌వీరా ఆస్పత్రిలో అత్యాధునిక న్యూరోస‌ర్జరీ ఐసీయూ ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ అనంతపురం: అనంత‌పురం జిల్లాలో ప్రఖ్యాతి గాంచిన‌, రోగుల సంర‌క్షణ విష‌యంలో అత్యంత నిబ‌ద్ధ‌తకు పేరొందిన కిమ్స్ స‌వీరా ఆస్పత్రిలో అత్యాధునిక న్యూరోస‌ర్జరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)ను ప్రారంభించారు. ఎస్‌.వి. కిషోర్ రెడ్డి, డాక్టర్ పి.శ్రీ‌నివాస ప్రసాద్‌, డాక్టర్ అబీబ్ రాజా పాల్గొన్నారు. సంక్లిష్ట‌మైన న్యూరోస‌ర్జరీలు చేయించుకుని, ఆ త‌ర్వాత కూడా ఇంటెన్సివ్ న్యూరోలాజిక‌ల్ ప‌ర్యవేక్షణ‌, చికిత్స అవ‌స‌ర‌మైన రోగుల‌కు అత్యున్న‌త స్థాయి వైద్య సేవ‌లు అందించేందుకు వీలుగా ఈ అత్యాధునిక కేంద్రాన్ని ఏర్పాటుచేశారు.

అత్యున్నత సాంకేతికత‌, నైపుణ్యం

కొత్త న్యూరోసర్జరీ ఐసీయూలో అత్యాధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలు ఉన్నాయి, రోగులకు అందుబాటులో ఉన్న అత్యంత అధునాతన సంరక్షణ లభిస్తుంది.  యూనిట్ ముఖ్యాంశాలు: అడ్వాన్స్ డ్ మానిటరింగ్ సిస్టమ్స్: రోగుల పరిస్థితులను ఖచ్చితమైన, రియల్ టైమ్ మదింపు కోసం నిరంతర న్యూరోలాజికల్, ఫిజియోలాజికల్ మానిటరింగ్.హైటెక్ ఇమేజింగ్: ఎంఆర్ఐ, సీటీ స్కానర్లతో సహా ఆన్-సైట్ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ టెక్నాలజీ సాయంతో తక్షణ రోగనిర్ధారణ. ప్రత్యేక పరికరాలు: సంక్లిష్టమైన మెదడు,  వెన్నెముక శస్త్రచికిత్సల కోసం రూపొందించిన అత్యాధునిక న్యూరోసర్జికల్ పరికరాలు

నిపుణులైన వైద్య బృందం

అత్యంత నైపుణ్యం కలిగిన న్యూరోసర్జన్లు, ఇంటెన్సివిస్టులు, ప్రత్యేకంగా శిక్షణ పొందిన నర్సింగ్ సిబ్బందితో కూడిన మల్టీడిసిప్లినరీ బృందంతో కూడిన న్యూరోసర్జరీ ఐసీయూ… రోగుల‌కు సమగ్ర సంరక్షణను అందిస్తుంది. ప్రతి రోగికి ఉండే వేర్వేరు ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన చికిత్సా ప్రణాళికలను అందించడానికి మా బృందం అంకితమైంది. సాధ్యమైనంత ఉత్తమ ఫలితాలను అందిస్తుంది.

రోగి ఆధారిత చికిత్సలు

కిమ్స్ సవీరా ఆస్పత్రిలో పేషెంట్ కేర్, కంఫర్ట్ మా మొదటి ప్రాధాన్యత. న్యూరోసర్జరీ ఐసీయూలో రోగి కోలుకునేందుకు అవ‌స‌ర‌మైన సాయం చేయ‌డంతో పాటు.. రోగులు, వారి కుటుంబస‌భ్యులకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందించడానికి ఆధునిక సౌకర్యాలను కలిగి ఉంది. న్యూరోసర్జికల్ చికిత్సల‌లోని సంక్లిష్టతలను నావిగేట్ చేయడంలో కుటుంబాలకు సహాయపడటానికి మా కేర్ బృందం ఎప్పుడూ క‌ట్టుబ‌డి ఉంటుంది.

అత్యున్నత వైద్యానికి క‌ట్టుబ‌డి ఉంటాం

ఈ సంద‌ర్భంగా కిమ్స్ స‌వీరా ఆస్పత్రిలోని క‌న్సల్టెంట్ న్యూరోస‌ర్జన్లు డాక్టర్ సి. అనిల్‌, డాక్టర్ మోహ‌న ముర‌ళీకృష్ణ‌, క‌న్సల్టెంట్ క్రిటిక‌ల్ కేర్ వైద్యులు డాక్టర్ ర‌విశంక‌ర్ సి, డాక్టర్ చంద్రశేఖ‌ర్ టి మాట్లాడుతూ, “అత్యాధునిక వైద్య‌చికిత్సలు అందించ‌డంలో ఇప్ప‌టికే క‌ట్టుబ‌డి ఉన్న మాకు.. ఇప్పుడు ఈ స‌రికొత్త న్యూరోస‌ర్జరీ ఐసీయూను ప్రారంభించ‌డం మ‌రో అద్భుత‌మైన మైలురాయి. మా రోగుల‌కు అత్యున్నత స్థాయి ప్రత్యేక వైద్యచికిత్సలు అందించ‌డం, అందుకు అత్యాధునిక వైద్య ప‌రిజ్ఞానం, నైపుణ్యాల‌ను ఉప‌యోగించ‌డం ఈ కేంద్రం వ‌ల్ల సాధ్య‌మ‌వుతాయి” అని చెప్పారు. కిమ్స్ స‌వీరా ఆస్పత్రి చాలా సంవ‌త్సరాలుగా వైద్య ప‌ర‌మైన ఆవిష్కర‌ణ‌లు, రోగుల సంర‌క్షణ విష‌యంలో ముందంజ‌లో ఉంది. మేం సేవ‌లు అందించే ప్రజ‌ల ఆరోగ్యం, సంక్షేమాల‌ను మెరుగుప‌ర్చే ల‌క్ష్యంతో మా ఆస్పత్రిలో ప‌లు ర‌కాల స‌మ‌గ్ర వైద్యసేవ‌లు, అత్యాధునిక చికిత్సలు, స‌మ‌గ్ర సంర‌క్షణ అందిస్తున్నాము. మా నిబ‌ద్ధత క‌లిగిన వైద్య నిపుణులు రోగుల చికిత్సలోని ప్రతి ఒక్క అంశంలోనూ అత్యున్నత స్థాయి సేవ‌లు అందించేందుకు స‌దా కృషిచేస్తారు. న్యూరోస‌ర్జరీ ఐసీయూ గురించి మ‌రింత స‌మాచారం కోసం, అపాయింట్‌మెంట్ కోసం ద‌య‌చేసి ఆస్పత్రి వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి లేదా కాంటాక్ట్ స‌మాచారాన్ని సంప్రదించండి.

About Author