విధులకు దూరం… గడివేముల గ్రామ ప్రజలకు శాపం
1 min readరోగాలతో సతమతం..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: పేరుకే గడివేముల మండలం గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శి ఎప్పుడు సెలవులు పెడుతూ కుటుంబ సమస్యలతో అనారోగ్య బాగోలేదంటూ విధులు నిర్వహించడం లేదని గ్రామంలో పారిశుద్ధ్యం నిర్వహించడం లేదని గడివేముల గ్రామస్తులు ఆరోపిస్తున్నారు మండల కేంద్రానికి ఈ దుస్థితి పట్టడం కనీసం అధికారులు పట్టించుకోకపోవడం శాపంగా మారింది ఎమ్మెల్యే జిల్లాస్థాయి అధికారులు వచ్చినప్పుడు బ్లీచింగ్ పౌడర్ చల్లడం రోడ్లు శుభ్రపరచడం తప్పితే గ్రామంలో చెత్త సేకరణ కూడా సరిగ్గా నిర్వహించడం లేదని ఇష్టం వచ్చినప్పుడు చెత్త సేకరిస్తున్నారని తప్పనిసరి పరిస్థితుల్లో ఖాళీ ప్రదేశాల్లో ఇంట్లో ఉన్న చెత్తను పారవేస్తున్నామని గ్రామస్తులు తెలిపారు దీంతో కాలనీలో గొడవలు జరుగుతున్నాయని గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని. సెలవు పెట్టిన పంచాయతీ కార్యదర్శి స్థానంలో కనీసం ఇన్చార్జిని నియమించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అర్థం పడుతుంది విధులలో నిర్లక్ష్యం వహిస్తూ ప్రభుత్వ ఖజానా నుండి జీతం తీసుకుంటున్న అధికారులు వాతావరణం మారుతున్న సమయంలో వర్షాకాలంలో వైరల్ జ్వరాలు విజృంభించే సమయంలో కనీసం గ్రామంలో నీరు నిలబడ్డ చోట బ్లీచింగ్ పౌడర్ చల్లాలని అలాగే కొత్త ప్రభుత్వంలో రోజు విధులు నిర్వహించే పంచాయతీ కార్యదర్శిని నియమించాలని గడివేముల గ్రామ ప్రజలు కోరుతున్నారు .