PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు జీజీహెచ్​లో TB-ముక్త్ భారత్ బృందం పర్యటన

1 min read

ఆసుపత్రి ,  సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి, మాట్లాడుతూ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ వైద్యశాల లో ఈరోజు TB-ముక్త్ భారత్ బృందం ఆసుపత్రిని సందర్శించినట్లు తెలిపారు. అనంతరం వైద్య సిబ్బందితో ఇన్ఫెక్షన్ నియంత్రణ పద్ధతులకు సంబంధించి అవగాహన కల్పించినట్టు తెలిపారు.ఆసుపత్రిలోని పలు విభాగాలైన క్యాజువాలిటీ, AMC, న్యూ డయాగ్నస్టిక్ బ్లాక్ లో ల్యాబ్, ART CENTRE, TBCD విభాగాలలో TB-ముక్త్ భారత్ బృందం రౌండ్స్ నిర్వహించినట్లు తెలిపారు.TB-ముక్త్ భారత్ బృందం పర్యటనలో భాగంగా  బయో మెడికల్ వేస్టే మేనేజ్మెంట్ వైద్య సిబ్బందితో అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించినట్లు తెలిపారు.ఆసుపత్రిలో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలు మరియు నాణ్యమైన సేవలు మరియు సురక్షిత పద్ధతుల గురించి అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించి అనంతరం వాటి ఉపయోగాల గురించి ఈరోజు వైద్య సిబ్బందితో అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించినట్లు తెలిపారుబయో మెడికల్ వ్యర్థాలను ఎలా యూస్ చేయాలి,  వాటికి సంబంధించిన ఏ ఏ వ్యర్థాలను ఏ ఏ రంగు డబ్బాలలో వేయాలి, వ్యర్థాలను నిర్దేశించిన రంగు డబ్బాలలో మాత్రమే వెయ్యాలి అనే దానిపై సెగ్రిగేషన్ ఎలా జరగుతుంది,  అని వివిధ విభాగాల సిబ్బంది మరియు నర్సింగ్, శానిటేషన్ సిబ్బంది సంబంధిత  సూపరవైజర్స్ తో పాటు వైద్య సిబ్బంది తో అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి  TB-ముక్త్ భారత్, కోఆర్డినేటర్, డా.నీరద, ఆసుపత్రి ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ మరియు ARMO డా.వెంకటరమణ, మరియు అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, డా.కిరణ్ కుమార్, మరియు నర్సింగ్ సూపరింటెండెంట్, సావిత్రిబాయి, నర్సింగ్ సిబ్బంది, తదితరులు  పాల్గొన్నట్లు, ఆసుపత్రి & సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి  తెలిపారు.

About Author