మండల ప్రజలు రైతులు మధ్య దళారులను నమ్మి మోసపోకండి
1 min readఅధికారులను సంప్రదించండి- తాసిల్దార్ ఏ ఎన్ ప్రసాద్ రాజు
పల్లెవెలుగు వెబ్ హోళగుంద: మండల ప్రజలు రైతులు మీయొక్క పనుల కోసం మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని నేరుగా మండల తాసిల్దార్ కార్యాలయంలో తమను సంప్రదించి అవసరమైన పనులు చేసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా ఆయన తన చాంబర్లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ మధ్య దళారులను సంప్రదించడం వల్ల మధ్య దళారుల అధికారుల పేరు చెప్పి వేలకు వేలు దోచుకుంటున్నట్లు తెలిసిందన్నారు. కష్టపడిన సొమ్ము ఊరికే రాదు కదా మధ్య దళారుల దగ్గరికి వెళ్లి పనులు చేసుకోవడం వల్ల మీకు జరగరాని నష్టం జరుగుతుందన్నారు కొంతమంది మధ్య దళారులు అర్హత లేని పనులను చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఇలాంటి పనులు చేయమని తిరస్కరించినట్లు ఆయన పేర్కొన్నారు ఈ పాస్ బుక్, వన్ బి, అడంగల్ నమోదు, పొజిషన్ సర్టిఫికెట్లు కొరకు అర్హత ఉంటే వీఆర్వో, రెవిన్ ఇన్స్పెక్టర్, డిప్యూటీ తాసిల్దార్ రిపోర్టుల ఆధారంగా మీ పనులు వెంటనే కచ్చితంగా పరిష్కరిస్తామన్నారు గత రెండు నెలలు సాధారణ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ ఉన్నందున అందుబాటులో లేక పోయాము ప్రస్తుతం పనివేళల్లో కచ్చితంగా కార్యాలయంలో అందుబాటులో ఉంటామన్నారు మేము మీకు సేవ చేయడానికి ఉన్నామని ప్రభుత్వం మాకు జీతాలు చెల్లిస్తుందని ప్రజల సొమ్ముతో పని చేయవలసిన అవసరం తమకు లేదన్నారు చాలాకాలంగా రైతుల మధ్య హద్దులు భూ సమస్యలు ఉంటే ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు త్వరలో ప్రతి శనివారం రెవిన్యూ కోర్ట్ ఏర్పాటు చేసి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ వినో జూ కుమార్ వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.