PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యువకుల్లో రక్తదానంపై అవగాహన పెరగాలి : డా. భాస్కర్ రావు

1 min read

– 18 ఏళ్లు దాటిన వారు రక్తదానం చేయవచ్చు

పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : యువకుల్లో రక్తదానం పై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు కిమ్స్ హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ బొల్లినేని భాస్కరరావు. అంతర్జాతీయ రక్తదానం దినోత్సవాన్ని పురస్కరించుకొని కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ హాస్పిటల్స్ లో ప్రత్యేక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో పెరుగుతున్న రక్తం కోసం సరిపడా రక్తం అందుబాటులో లేకపోవడం అనేక ఇబ్బందులకు దారి తీస్తుంది. కిమ్స్ హాస్పిటల్ లోని గణాంకాలను పరిశీలిస్తే 30 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు ఉన్న వారు అధికంగా రక్తదానం చేస్తున్నారు. కానీ 18 నుండి 30 సంవత్సరాల వరకు ఉన్న యువకులు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని సూచించారు. రక్తదానం అపోహలు ఉండడం వల్ల ఈ ఇబ్బందులు వస్తున్నాయి, ఇక్కడ బ్లడ్ బ్యాంక్ విభాగాధిపతి డా. కీర్తి అన్ని అపోహాలను నివృత్తి చేస్తున్నారు. రక్త దానం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.

యువ‌త‌కు అవ‌గాహ‌న అవ‌స‌రం

చాలామంది యువ‌త‌కు ర‌క్తదానంపై స‌రైన అవ‌గాహ‌న ఉండ‌ట్లేదు. ఎప్పుడైనా త‌మ బంధువులకు గానీ, స్నేహితులకు గానీ ర‌క్తం అవ‌స‌ర‌మైన‌ప్పుడు మాత్రమే వ‌స్తున్నారు త‌ప్ప‌, ఇత‌ర సంద‌ర్బాల్లో పెద్దగా రావ‌డం లేదు. వారికి ర‌క్తదానం ప్రాధాన్యం అంత‌గా తెలియ‌ట్లేదు. ఇందుకోసం క‌ళాశాల‌ల్లో అవ‌గాహ‌న కార్యక్రమాలు నిర్వహించాలి” అని డాక్టర్ కీర్తి చెప్పారు. అంతర్జాతీయ రక్తదానం దినోత్సవాన్ని పురస్కరించుకొని​ రక్తదానం చేసిన వారికి జ్ఞా​పికలు అందజేశారు.

About Author