ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు హర్షణీయం
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: రాష్ట్ర ప్రభుత్వం “ఏపీ లాండ్ టైటిలింగ్ యాక్టు” ను రద్దు చేయడం హర్షణీయం అని పత్తికొండ బార్ అసోసియన్ అధ్యక్షుడు రంగస్వామి, ప్రధాన కార్యదర్శి మహేశ్, సీనియర్ న్యాయవాదులు సురేష్ కుమార్, మైరాముడు, సత్య నారాయణ,సురేంద్ర కుమార్, చంద్రశేఖరనాయుడు అన్నారు. శుక్రవారం స్థానిక బార్ అసోసియేషన్ కార్యాలయం లో న్యాయవాదులు కేక్ కట్ చేసి, ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను వ్యతిరేకిస్తూ గతంలో ఆందోళనలు చేశామన్నారు. ఈ చట్టంలో అనేక లోపాలు ఉన్నాయని, అది అమలు అయితే ప్రజలకు నష్టం కలుగుతుందని న్యాయవాదులు విధులు బహిష్కరించి తమ నిరసనలు, ఆందోళనలు చేశామన్నారు. సివిల్ కేసుల విచారణను కోర్టుల పరిధి నుంచి తొలగించే సెక్షన్ల ను సవరించాలని డిమాండ్ చేశామన్నారు. నూతనంగా ఎన్నికైన ప్రభుత్వం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు న్యాయవాదుల తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమం లో బార్ అసోసియేషన్ కోశాధికారి రాజశేఖర్ నాయుడు, సహాయ కార్యదర్శి వాసుదేవ నాయుడు, ఏజీపీ నరసింహయ్య, న్యాయవాదులు మల్లికార్జున, నాగేష్, నాగభూషణరెడ్డి, సురేంద్రకుమార్, రమేష్ బాబు, సోమప్ప, నాగలక్ష్మయ్య, బాలభాష, ప్రసాద్ బాబు, నారాయణ స్వామి, జటంగి రాజు, అరుణ్, శ్రీకాంత్ రెడ్డి, వెంకటేశ్వర్లు, సుధాకృష్ణ, చిన్న మునెయ్య, మధు, రజాక్, శివకృష్ణ, నరసింహులు, ఇలియాజ్, లక్ష్మన్న, సాంబశివ పాల్గొన్నారు.