అధికారులపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే జయసూర్య
1 min read-తనిఖీలకు ఎప్పుడు వస్తానో నాకే తెలీదు..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: కార్యాలయాలను తనిఖీ చేయడానికి నేను ఎప్పుడు వస్తానో నాకే తెలియదని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. శుక్రవారం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో అన్ని గ్రామాల నీటి సౌకర్యానికి గాను 70% పూర్తి చేయడం జరిగిందని తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం 30 శాతం కూడా కూడా చేయలేదని ఇప్పుడు మళ్లీ మనమే అధికారంలోకి వచ్చాం ఆ పనులన్నీ పూర్తి చేస్తాం ఈ మండలాన్ని చేస్తామని అన్నారు.అధికారులపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే.. మండలంలోని అన్ని శాఖల అధికారులు సమయ పాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.ఈ మండలం మూల ప్రాంతం ఇక్కడికి ఎవరూ రారులే అని అనుకుంటే కుదరదని నేనే ఆకస్మిక తనిఖీలకు వస్తానని ఎవరైనా సరే అధికారులు డిప్యూటేషన్ పై ఇక్కడ పని చేస్తుంటే వారు బదిలీపై వెళ్లాలన్నారు.ఈ మండలాన్ని నీటి వసతి మరియు రోడ్లు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మండలానికి ఓ ప్రత్యేకత ఉందన్నారు. విద్యుత్తు సమస్యలపై ఎప్పటికప్పుడు ఆ శాఖ అధికారులు పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులు సమావేశానికి ఎవరూ రాలేదా అని ఆయన అడిగారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల మండల అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.