జి.పుల్లయ్య కాలేజీకి కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక వెంకయపల్లిలోని జీ. పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలకు బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా కర్నూల్ రెడ్ క్రాస్ వారు నిర్వహించిన అభినందన సభలో జీ.పుల్లయ్య ఇంజనీరింగ్ ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులు నిరంతరంగా రక్తదాన కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు కర్నూల్ కలెక్టర్ జీ.పులయ్య కాలేజీకి అభినందనలు తెలుపుతూ ప్రశంస పత్రాన్ని అందజేశారు. ఈ అవార్డును ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్
ఎస్. శంకర్ ప్రసాద్ అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ డా. జి సృజన, ఐఏఎస్. గారు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానం, ఆసుపత్రిలో శాస్త్ర చికిత్స సమయంలో రక్తం ఎంతో అవసరం ఉంటుందని. రక్త దాతల వల్లనే రక్తం కొరత ఏర్పడకుండా వైద్యులు ప్రాణాలు కాపాడగలుగుతున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు, అలాగే రక్త దాతలు ప్రాణదాతలతో సమానమని వారిని అభినందించార. కళాశాల ప్రిన్సిపల్ డా.సి శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ కళాశాలకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నందుకుగాను ఎన్ఎస్ఎస్ వాలంటీర్లని అభినందించారు. బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు రెడ్ క్రాస్ మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డీన్ స్టూడెంట్ అఫైర్స్ ప్రొఫెసర్ ఎస్. శశి కుమార్. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎస్ శంకర్ ప్రసాద్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.