శిశు గృహాన్ని సందర్శించిన రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు
1 min readదత్తతకు అర్హులైన బాలలకు వెంటనే తగు చర్యలు తీసుకోవాలి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : స్థానిక విద్యానగర్ లో మహిళభివృది మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశు గృహ ను రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు డాక్టర్ జంగం. రాజేంద్ర ప్రసాద్ మరియు చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ నోడల్ అధికారి జె. దుర్గా ప్రసాద్ కలిసి సందర్శించడం జరిగినది. ప్రస్తుతం శిశు గృహ లో ఆశ్రయం పొందుచున్న 8 మంది చిన్నారులు యొక్క వ్యక్తిగత వివరాలను విచారణ చేసి దత్తత కు అర్హులైన బాలల కు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని CWC సభ్యులు జారీ చేయవలసిన లిగ్గల్లీ ఫ్రీ ఫర్ ఎడప్షన్ ఆర్డర్ నూ వెంటనే ఇవ్వవలసినదిగా CWC వారిని ఆదేశించటమైనది. బాలల కు అందిస్తున్న సేవలను జిల్లా కలెక్టరు శ్రీ వె. ప్రసన్న వెంకటేశ్ ఐ ఎ ఎస్ వారు అందిస్తున్న సహాయ సహకారము లు రాష్ట్రము లో మరి ఏ ఇతర జిల్లాల లోనూ లేని విధంగా ఇక్కడి శిశుగృహ నీ అభివృద్ధి చేయటం పట్ల కమీషన్ తరుపున అభినందనలు తెలియజేస్తున్నాము అని తెలియజేసినరు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సి హెచ్. సూర్య చక్ర వేణి, శిశు గృహ మేనేజర్ భార్గవి తదితరులు పాల్గొన్నారు.