PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విలువలతో కూడిన వైద్యం చేయండి…

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: “విలువలతో కూడిన వైద్యం చేయండి” అని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మరియు కె .యం.సి ప్రిన్సిపల్  డా.చిట్టి నరసమ్మ అన్నారు . శనివారం మెడికల్ కాలేజ్ లోని లెక్చర్  గ్యాలరీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్లకి  యన్.యం.సి నిబంధనల మేరకు ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణ తరగతులు ముగింపు సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్యులు   తమ వైద్యం లో ప్రతి పనికి రికార్డు మెయింటెయిన్ చేయాలని ఇబ్బందులు ఏర్పడ్డప్పుడు రికార్డులు ఎంతో ఉపయోగ పడతాయని అన్నారు. సర్వజన వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వైద్యులు రోగులు ఎడల సింపతి చూపించడం కాదనిఎంపతి చూపాలని, రోగులు డాక్టర్ పై ఎంతో నమ్మకంతో తమ సమస్యలు చెప్పుకుంటారని వాటిని సావధానంగా వినాలని, ప్రతి వైద్యుడు ఎన్ ఎం సి నిబంధనలను తప్పకుండా పాటించాలని అప్పుడే వైద్యులకు సమాజం లో గౌరవం ,రక్షణ ఉంటుందని తెలిపారు. ఈ మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో గుడ్ క్లినికల్ మరియు లేబరేటరీ ప్రాక్టీసెస్ , ఎథిక్స్ గురించి ఫార్మా కాలజీ, పథాలజీ మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ కమ్యూనిటీ మెడిసిన్ విభాగపు వైద్యులు పి.జి వైద్య విద్యార్థులకు  శిక్షణ ఇవ్వడం జరిగింది. మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్ కోఆర్డినేటర్ మరియు కమ్యూనిటీ మెడిసిన్ ఇన్చార్జ్ హెచ్.ఓ.డి ప్రొఫెసర్  డాక్టర్ సింధియా శుభప్రద  ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

About Author