PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు జిల్లాను స్మార్ట్ సిటి గా తీర్చిదిదేందుకు కృషి చేస్తాం

1 min read

ఆంధ్రప్రదేశ్ ను గుజరాత్ రాష్ట్రం తరహాలో పారిశ్రామికాభివృద్ధి చేస్తాం

21 రోజులలో సింగిల్ విండో క్లియరెన్స్ కు చర్యలు తీసుకుంటాం

రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం .. ఆహారశుద్ధి శాఖ మంత్రివర్యులు టిజి భరత్

పల్లెవెలుగు వెబ్  కర్నూలు: కర్నూలు జిల్లాను స్మార్ట్ సిటి గా తీర్చిదిదేందుకు కృషి చేయడంతో పాటు శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం & ఆహారశుద్ధి శాఖ మంత్రివర్యులు టి.జి. భరత్ మీడియా సమావేశంలో తెలిపారు. శనివారం స్థానిక న్యూ మున్సిపల్ కౌన్సిల్ హాలులో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రివర్యులు టి.జి.భరత్ మీడియా ప్రతినిధులతో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ ప్రచారానికి వెళ్ళిన సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కల్లారా చూడడం జరిగిందని అదే విధంగా  ప్రజల నుండి విన్నతుల  రూపంలో వచ్చిన  సమస్యల గురించి అన్నింటిని ఈరోజు మున్సిపల్ కమిషనర్ తో చర్చించి వాటి పరిష్కారం కొరకు పలు సూచనలు జారీ చేయడం జరిగిందన్నారు.. కర్నూలు నగరాన్ని  స్మార్ట్ సిటి గా తీర్చిదిద్దెందుకు గాను అన్ని రకాల చర్యలను త్వరితగతిన చేపడతామన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలు తీసుకుని వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని, రానున్న 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుజరాత్ రాష్ట్రం తరహాలో పారిశ్రామికాభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఓర్వకల్లు ఇండస్ట్రియల్ జోన్ ను కూడా అభివృద్ధి చేస్తామన్నారు.. గతంలో పారిశ్రామిక రంగానికి సంబంధించి  ఎంఓయు చేసుకున్న వాటిని తిరిగి అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. 21 రోజులలో సింగిల్ విండో క్లియరెన్స్ కు చర్యలు తీసుకుంటానన్నారు.ప్రెస్ కాన్ఫరెన్స్ లో మున్సిపల్ కమిషనర్ భార్గవతేజ తదితరులు పాల్గొన్నారు.

About Author