హిందువులు పూజించే గోహత్యను “చట్ట” ప్రకారం ఆడ్డుకోని తీరాల్సిందే..
1 min readవిశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ…..
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఈ రోజు ఉదయం 11:00 గం.లకు జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులకు రాబోయే బక్రీద్ సందర్భంగా గో అక్రమ రవాణా/హత్యల నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ వినతి పత్రాలు అందించిన అనంతరం విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ మాట్లాడుతూ… భారతదేశంలో మెజార్టీ ప్రజలు సర్వదేవతా నిలయమని, పాలిచ్చి కాపాడే మాత అని, అని పూజించుకునే గోమాత ను తాము భుజించడానికి ఎన్నో జంతువులు ఉన్నా, 1977 లోనే గో అక్రమ రవాణా/హత్యలపై నిషేధం ఉన్నా, చట్టాన్ని ఉల్లంఘిస్తూ… పట్టుబట్టి మరీ గో మాంసాన్ని భుజిస్తూ హిందూ ధర్మాన్ని అపహాస్యం చేయడం దారుణమనీ అటువంటి చర్యలను ఓటుబ్యాంకు రాజకీయాలు చేసే ప్రభుత్వాలు, రాజకీయ నాయకులకు వత్తాసు పలికే అధికారులు నిర్లక్ష్యం వల్లనే ఇప్పటికీ లక్షలాది గోవులు అనధికారికంగా హత్యగావింపబడుతుండడం చూసి సిగ్గుపడాల్సిన విషయమని తెలియజేశారు.విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్ మాట్లాడుతూ విచ్చల విడిగా జరుగుతున్న గో హత్యను ఇక ఏమాత్రం ఉపేక్షించబోమని ఎట్టి పరిస్తితుల్లోనూ గోహత్య నిషేధ చట్టాన్ని పటీష్టంగా అమలుచేసి తీరాలనీ లేని ఎడల గోహత్య నిషేధ చట్టం కాగ్నిజబుల్ (cognizable)చట్టం అయినందున విశ్వహిందూ పరిషత్ – బజరంగ్ దళ్ కార్యకర్తలు నేరుగా గో అక్రమ రవాణా మరియు హత్యలను అడ్డుకొంటామనీ హెచ్చరించారు.అనంతరం కర్నూలు నగర పోలీసు అధికారి గారికి, సబ్ డివిజినల్ ఆఫీసర్ విజయశేఖర్కి, డీ.ఆర్.వో.మధుసూధన రావుకి, జిల్లా పశువైద్యాధికారికి, 1,2,3,4,పట్టణ పోలీసు అధికార్లకు, కర్నూలు తాలుకా, కర్నూలు రూరల్ పోలీసు అధికార్లకు, వ్యవసాయ శాఖాధికారి కి, మునిసిపల్ కమీషనర్ భార్గవతేజ కి,రవాణాశాఖాధికారి లకు గోవుల అక్రమ రవాణా , హత్యలను అడ్డుకోవాలని వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ విభాగ్ కన్వీనర్ నీలి నరసింహ, విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా సహకార్యదర్శి గోవిందరాజులు, ఈపూరి నాగరాజు, నగర బజరంగ్దళ్ కన్వీనర్ తెలుగు భగీరథ,మండ్ల హరికృష్ణ, గుజరాతి సురేష్,శివపురం నాగరాజు, సల్కాపురం బాబురావు, యశ్వంత్, రాంబాబు, చైతన్య కుమార్, లోకేష్, అభిషేక్, వెంకటేష్ .తదితరులు పాల్గొన్నారు.