ఆఫర్లతో ఆకట్టుకుంటున్న ‘జోయాలుక్కాస్ ’
1 min readకర్నూలు,పల్లెవెలుగు: పంచ వాణిజ్య రంగంలో తనదైనశైలిలో రాణిస్తున్న ‘జోయాలుక్కాస్ ’.. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా బంగారు ఆభరణాలు తయారు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. వివిధ ఆకృతులలో నాణ్యమైన వజ్రాలు, బంగారు, సిల్వర్ ఆభరణాలు రూపొందించడమేకాకుండా … తక్కువ ధరకు విక్రయిస్తూ మహిళాలోకాన్ని ఆకర్షిస్తోంది. గోల్డ్, డైమండ్స్, ప్రెషస్ మరియు సిల్వర్ జ్యువెలరీ తయారీ (మజూరీ) చార్జీలలో 50 శాతం తగ్గింపుతో ఇస్తున్నట్లు ప్రకటించిన యాజమాన్యం .. ఆదివారం జోయాలుక్కాస్ కర్నూలు బ్రాంచ్లో వినియోగదారులు జె. రాధిక, మహబూబ్ బాష, హర్ష తదితరులు బంగారు ఆభరణాల ప్రదర్శనను ప్రారంభించారు.ఈ సందర్భంగా వినియోగదారులు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు నయా ఆభరణాలు రూపొందించడమేకాకుండా.. వినియోగదారులకు అనుకూలమైన ధర, మజూరీ చార్జీలో 50 శాతం తగ్గింపు ఇవ్వడం అభినందనీయమన్నారు. అనంతరం కర్నూలు బ్రాంచ్ మేనేజర్ ఐ.లిగేష్ మాట్లాడుతూ కస్టమర్ల అభిప్రాయాలు… అభిరుచులకు అనుగుణంగా తమ సంస్థ బంగారు ఆభరణాలు రూపొందిస్తోందన్నారు. ఆర్డర్ ఇస్తే…వినియోగదారులకు కావాల్సిన రూపంలో బంగారు, సిల్వర్ ఆభరణాలు తయారు చేయించడంలో తమ సంస్థ ముందుంటుందన్నారు. ఏడాదికోసారి ప్రత్యేక ఆఫర్ ఇవ్వడం జోయాలుక్కాస్ సంస్థ కు మాత్రమే సాధ్యమన్నారు. కార్యక్రమంలో జోయాలుక్కాస్ సిబ్బంది వెంకట్, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.