మంత్రి టి.జి భరత్ ను కలిసిన టీడీపీ నాయకులు
1 min readకర్నూలు, పల్లెవెలుగు: రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ ను ఆదివారం టీడీపీ కర్నూలు జిల్లా నాయకుడు నాగరాజు యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ ఆంధ్ర ప్రదేశ్ కు పరిశ్రమలు తీసుకొచ్చి.. అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. అదేవిధంగా కర్నూలును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలన్నారు. అంతేకాక కార్పొరేషన్ పరిధిలో నిలిచిన అభివృద్ధిని పరుగులు పెట్టించాలని ఈ సందర్భంగా టీడీపీ కర్నూలు జిల్లా నాయకుడు నాగరాజు యాదవ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ ను కోరారు. మంత్రి టి.జి. భరత్ భవిష్యత్లో మరెన్నో పదవులు పొందాలని ఆయన ఆకాంక్షించారు.