కాలభైరవుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు
1 min readకడప, పల్లెవెలుగు: కడప నగరానికి చెందిన బాసట సేవా సంస్థ దత్తత గ్రామమైన కాలభైరవపురం (ఎమ్మెస్ కొట్టాలు) లో పున:నిర్మించిన పురాతనమైన శ్రీ ఇష్టకామ్యార్థ కాలభైరవ స్వామి దేవస్థానంలో కడప ఎమ్మెల్యే దంపతులు శ్రీమతి రెడ్డప్ప గారి మాధవి రెడ్డి, శ్రీ శ్రీనివాసులు రెడ్డి టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు విచ్చేసి ప్రత్యేక పూజలు శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాజులపల్లి పురుషోత్తమ రెడ్డి ఎమ్మెల్యే గా మంచి మెజార్టీతో గెలుపొందితే 108 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నామని నేడు ఆయన ఎమ్మెల్యే దంపతులతో 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నాడు. అనంతరం ఎమ్మెల్యే గారి దంపతులు కుష్మాండ దీప సేవారాధన కార్యక్రమాల్లో పాల్గొని సంతృప్తి చెందారు. ఈ కార్యక్రమంలో బాసట ప్రతినిధులు పాల్గొన్నారు.