ఏ బి ఆర్ ఎస్ ఎం జాతీయ సమావేశాలకు హాజరైన ఆపస్ ప్రతినిధులు
1 min readవిద్యారంగ మరియు ఉపాధ్యాయ సమస్యలపై వినతులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అయోధ్య నందు మూడు రోజుల పాటు నిర్వహించిన అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్షిక్ మహసంఘ్( ఏ బి ఆర్ యస్ యం) జాతీయ సమావేశాలకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి ఆపస్ పక్షాన రాష్ట్ర అధ్యక్షులు యస్ బాలాజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వి సత్యనారాయణ, సంఘటన కార్యదర్శి సి హెచ్ శ్రావణ కుమార్, ఏ బి ఆర్ ఎస్ ఎం జాతీయ సహకార దర్శి ఎం రాజశేఖర్ రావు, ఏ బి ఆర్ ఎస్ ఎం ఉన్నత విభాగం నుండి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ వై వి రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ గంగినేని రంగనాథ్ హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు శవన్న గారి బాలాజీ మాట్లాడుతూ ఈనెల 15 నుంచి మూడు రోజులపాటు జరిగిన ఈ సమావేశాలలో విద్యారంగా మరియు ఉపాధ్యాయ సమస్యలపై సవివరంగా చర్చించడం జరిగింది అని, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం పక్షాన సిపిఎస్ రద్దుకు కేంద్రస్థాయిలో ప్రయత్నించాలని, కేంద్ర ప్రభుత్వం మెమో 57 ప్రకారం 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ అమలుకు కృషి చేయాలని, ఏకీకృత సర్వీసు రూల్స్ అమలులో ఉన్న ఇబ్బందులు తొలగించేందుకు తగు చర్యలు తీసుకోవాలని, నూతన జాతీయ విద్యా విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో ఒకే రకంగా అమలు చేయాలని అందుకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల చేసిన 117 జీవో రద్దు చేయాలని, 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనాన్ని వెనక్కు తీసుకోవాలని, బోధ నేతల పనుల నుండి ఉపాధ్యాయులకు విముక్తి కల్పించాలని, ఆదాయపన్ను నుండి ఉపాధ్యాయులను మినహాయించాలని ఇంకా పలు సమస్యలను ఏ బి ఆర్ ఎస్ ఎం సంఘ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని తెలిపారు.