అంజుమన్- యి- హిమాయతుల్ ఇస్లాం ఈద్గాలో లోకేష్ బక్రీద్ ప్రార్థనలు
1 min readముస్లిం సోదరులకు యువనేత శుభాకాంక్షలు
పల్లెవెలుగు వెబ్ మంగళగిరి: బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరి అంజుమన్- యి- హిమాయతుల్ ఇస్లాం ఈద్గాను సందర్శించారు. ముస్లింసోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన యువనేత వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈద్గా వద్ద యువనేతకు ఘనస్వాగతం లభించింది. ఇస్లాంలో త్యాగం, దానగుణాలకు ప్రత్యేకమైన స్థానముంది. ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ జరుపుకునే పండుగ ఈద్ అల్ అదా (బక్రీద్) సమాన భావన పెంపొందిస్తుందని లోకేష్ అన్నారు. ప్రార్ధన అనంతరం లోకేష్ ముస్లిం సోదరులను ఆప్యాయంగా పలకరించి అందరితో ఫోటోలు దిగారు. వారు లోకేష్ దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు.