130 నగరాలకు అమెజాన్ ఫ్రెష్ విస్తరణ ఇంటి ముంగిటకు కిరాణా సౌకర్యం
1 min readపల్లెవెలుగు వెబ్ కడప : ఫుల్ బాస్కెట్ కిరాణా సరుకుల సర్వీస్ అమెజాన్ ఫ్రెష్ 130 నగరాలకు విస్తరించినట్లు సంస్థ ప్రతినిధులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అమెజాన్ ఇండియా, అమెజాన్ ఫ్రెష్ సెల్లర్స్… 11 వేలకు పైగా పండ్లు, కూరగాయల రకాలను రైతుల నుంచి సేకరిస్తారన్నారు. ‘4-స్టెప్ నాణ్యతా తనిఖీ’ ద్వారా ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తారన్నారు. అంబాలా, ఔరంగాబాద్, హోషియార్ పూర్, ధార్వాడ్, ఉనా, సూరి వంటి 130 నగరాల్లో వినియోగదారులకు ఇంటి ముంగిటకే తీసుకురావడంతో సమయం ఆదా కావడంతో వారు ఆనందిస్తారన్నారు. తమ వారపు/నెలవారీ బాస్కెట్‌ను రూపొందిస్తున్నప్పుడు అమెజాన్ ఫ్రెష్ సెల్లర్స్, బ్యాంక్ భాగస్వాముల నుంచి ఉత్తేజభరితం పొందుతారన్నారు. భారతదేశంలో కిరాణా షాపింగ్ అమెజాన్ ఫ్రెష్ పునఃరూపుదిద్దుతోందని డైరెక్టర్ శ్రీకాంత్ శ్రీరామ్ చెప్పారు. క్యాష్ బాక్ ఆఫర్స్, బ్యాంక్ డిస్కౌంట్స్ నుంచి కస్టమర్స్ ప్రయోజనాలు పొందవచ్చన్నారు. అమెజాన్ ఫ్రెష్ కిరాణా సరుకుల కోసం amazon.in పై ప్రత్యేకమైన యాప్-ఇన్-యాప్ తో సులభమైన షాపింగ్ అనుభవాన్ని, తరచుగా షాపింగ్ చేసిన వస్తువులు చెక్ అవుట్ సమయంలో మర్చిపోకుండా వ్యక్తిగత విడ్ గెట్స్, బై గైన్ ఆప్షన్, రిమైండర్స్ వంటి సౌకర్యవంతమైన ఫీచర్స్ అందిస్తుందన్నారు. ప్రతి నెల ఒకటి నుంచి ఏడు వరకు సూపర్ వేల్యూ డేస్ తో కస్టమర్స్ తమ నెలవారీ బాస్కెట్ ను రూపొందించుకోవచ్చన్నారు.