ఈ యాప్స్ వెంటనే డిలీట్ చేయండి : గూగుల్
1 min readపల్లెవెలుగు వెబ్: ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ 9 యాప్స్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ప్లే స్టోర్ లోని 9 ఫోటో ఎడిటింగ్ యాప్ లతో ఫేస్ బుక్ యూజర్స్ లాగిన్, పాస్ వర్డ్ వివరాలు సేకరిస్తున్నట్టు డాక్టర్ వెబ్ అనే సైబర్ సెక్యురిటీ సంస్థకు చెందిన మాల్ వేర్ అనలిస్ట్ విభాగం వెల్లడించింది. ప్రత్యేకమైన సాంకేతిక సాయంతో హ్యాకర్స్ యాప్స్ లోకి ప్రవేశించి సెట్టింగ్స్ లో మార్పులు చేస్తున్నట్టు గమనించామని డాక్టర్ వెబ్ తెలిపింది. వినియోగదారులు తమ అకౌంట్స్ లో లాగిన్ అయిన వెంటనే కుకీస్ తోపాటు వారి వివరాలు సేకరించి సైబర్ నేరగాళ్లకు అందిస్తున్నట్టు డాక్టర్ వెబ్ తెలిపింది.
గూగుల్ డిలీట్ చేయమన్న యాప్స్ ఇవే :
- పిఐపి ఫోటో
- ప్రాసెసింగ్ ఫోటో
- రబ్బిష్ క్లీనర్
- హోరోస్కోప్ డైలీ
- ఇన్ వెల్ ఫిట్ నెస్
- యాప్ లాక్ కీప్
- లాకిట్ మాస్టర్
- హోరోస్కోప్ పై
- యాప్ లాక్ మేనేజర్
ఈ యాప్స్ వెంటనే డిలీట్ చేయండి : గూగుల్