మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏలూరు ఎమ్మెల్యే
1 min readఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ప్రస్తావన
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గం నుంచి తిరుగులేని మెజార్టీతో గెలుపొంది చరిత్రను తిరగరాసిన ఎమ్మెల్యే బడేటి చంటి అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు చర్యలకు ఉపక్రమిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే పలువురు మంత్రులను కలిసి నియోజకవర్గానికి కావాల్సిన నిధులు, ఇతర అంశాలపై చర్చిస్తూ వస్తున్నారు. తాజాగా మానవ వనరులు, ఐటీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖల మంత్రి నారా లోకేష్‌ను,గనులు, జియాలజీ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రలను ఎమ్మెల్యే బడేటి చంటి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అమరావతిలోని సెక్రటేరియట్లో మంత్రుల ఛాంబర్లలో వారిని కలుసుకున్న ఎమ్మెల్యే చంటి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచే దిశగా చేసిన అలోచనలను మంత్రులతో ఎమ్మెల్యే చంటి పంచుకున్నారు. మంత్రులతో ప్రత్యేకంగా భేటి అయిన ఎమ్మెల్యే చంటి నియోజకవర్గాభివృద్ధిపై కొద్దిసేపు చర్చించుకున్నారు. ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై దృష్టిపెడుతూ వచ్చిన ఎమ్మెల్యే బడేటి ఇదే అంశాన్ని మంత్రుల వద్ద ప్రస్తావించి ఆ దిశగా నిధులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా వారిని కోరారు.