వడ్డెమాను లో అంగన్వాడీ పిలుస్తోంది రా కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని వడ్డెమాను గ్రామంలో బుధవారం అంగన్వాడీ బడిబాట కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ పిలుస్తోంది రా కార్యక్రమం అంగన్వాడీ కార్యకర్తలు శెట్టి లలితమ్మ ,గాదె వెంకట రవణమ్మ, సగినేల ఇందిరమ్మలు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరినీ అంగన్వాడి కేంద్రంలో చేర్పించాలని ఆయా సెంటర్లో పరిధిలో నివాసముంటున్న ప్రాంతంలో ర్యాలీ నిర్వహించి అంగన్వాడి కేంద్రం చేర్పించాలని పిల్లల తల్లిదండ్రులను అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు కోరారు.అంగన్వాడీ కేంద్రాలలో చిన్నపిల్లలకు మంచి ఆటపాటలతో కథనాలతో సృజనాత్మకత సంసిద్ధత తో కూడిన పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది అని తెలిపారు.ఈ కార్యక్రమాల పట్ల పిల్లలకు శారీరక మానసిక అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని తల్లిదండ్రులు ఈ విషయాలు గమనించాలని వారు కోరారు.బాలింతలకు,గర్భిణీలకు ప్రభుత్వం అందిస్తున్న మంచి పౌష్టికరమైన ఆహారాన్ని అందించి ఆరోగ్య సూత్రాలు తెలియజేయడం జరుగుతుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఆయాలు సుశీలమ్మ,లక్ష్మి,మమత లతో పాటు గర్భిణీ లు తదితరులు పాల్గొన్నారు.