11 మంది తలసేమియా చిన్నారులకు రక్త మార్పిడి చికిత్స
1 min readపౌష్టిక ఆహారం, వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలి
రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి
భోజన సదుపాయం మరియు డ్రైఫ్రూట్స్ పంపిణీ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రభుత్వ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ తల సేమియా భవనంలో 11 మంది తల సేమియా, సికిల్ సెల్ ఎనీమియా చిన్నారులకు రక్త మార్పిడి చికిత్స నిర్వహించినట్లు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈరోజు ప్రపంచ సికిల్ సెల్ ఎనీమియా నివారణ దినోత్సవం అని అన్నారు. సికిల్ సెల్ అనేది జన్యుపరమైన మరియు రక్త సంబంధిత వ్యాధి అని, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉంటున్నారని అన్నారు. పౌష్టికాహారం మరియు వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని కృష్ణారెడ్డి తెలిపారు. ఈరోజు తల సేమియా చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకు భోజనాలు మరియు డ్రై ఫ్రూట్స్ ను పంపిణీ చేసిన మానవత సభ్యులు పరిమి భాగ్యలక్ష్మి , దేవినేని భాస్కర్ రావుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి కేబీ సీతారాం, డాక్టర్ ఆర్ఎస్ఆర్కే వరప్రసాదరావు, గౌరవ కార్యదర్శి కడియాల కృష్ణారావు, రత్నాకరరావు, పరిమి భాగ్యలక్ష్మి, దేవినేని భాస్కరరావు, కె.వి రమణ తదితరులు పాల్గొన్నారు.