అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి
1 min readఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ పనిచేస్తున్నారు
కొందరి అధికారులపై ఎమ్మెల్యే జయసూర్య సీరియస్
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మండలంలో ఉన్న ప్రతి అధికారి బాధ్యతయుతంగా విధులు నిర్వహించాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. నంద్యాల జిల్లానందికొట్కూరు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఉ.11 నుంచి మ.2 వరకు మండల సమీక్ష సమావేశం ఇన్చార్జి ఎంపీడీఓ సంజన్న అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు.ఈయనకు అధికారులు పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా పరిచయ కార్యక్రమం పంచాయితీ కార్యదర్శులు,వీఆర్వోలు, వివిధ శాఖల అధికారులను మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే అడిగారు.తర్వాత జరిగిన సమావేశంలో వివిధ శాఖల మండల అధికారులు తమ నివేదికలను చదివారు.తమ తమ శాఖల పరిధిలో గతంలో ఏమేమి పనులు జరిగాయి ప్రస్తుతం పల్లెల్లో ఏ సమస్యలు ఉన్నాయని అధికారులను అడిగారు.కొందరు అధికారులు సమావేశానికి రాకపోవడం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.సమావేశానికి రాని వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఎంపీడీవోను ఆదేశించారు.పెండింగ్ పనులు,సమస్యల గురించి అధికారులను అడిగారు. మండలంలోని పాఠశాలల్లో నాడు నేడు పనులు ఎక్కడెక్కడ పూర్తయ్యాయి ఇంకా పెండింగ్ లో ఉన్న వాటి వివరాలు నాకు అందజేయాలని నాడు నేడు పనుల్లో అవినీతి జరిగిందని ఎంఈఓ ఫైజున్నిసా బేగం పై మరియు హంద్రీనీవా కాలువ లస్కర్లపై ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు.గత ప్రభుత్వంలో మాదిరి కాకుండా ప్రజలకు మీరు అందుబాటులో ఉంటూ గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని అన్నారు.మీకు ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే అధికారులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దామోదర్ రెడ్డి,ఈ ఓఆర్డి నాగేంద్ర ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ విశ్వనాథ్, పిఆర్ఏఈ ప్రతాప్ రెడ్డి,జలకళ స్వాములు మరియు అధికారులు పాల్గొన్నారు.