PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వయోవృద్ధులు ఆరోగ్యం పట్ల నిరంతరం జాగ్రత్తలు  వహించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  వయోవృద్ధులు ఆరోగ్యం పట్ల నిరంతరం జాగ్రత్తలు  వహించాలని   ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ జయప్రకాష్, జనరల్ ఫిజీషియన్    రంగనాయక్, చెవి, ముక్కు వైద్య నిపుణులు   డాక్టర్ బాలిశ్వర్ లు అన్నారు. వయోవృద్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  గురు బ్రహ్మ నగర్  లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో వయోవృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షులు  నాగరాజు,  మాజీ అధ్యక్షులు సహదేవరెడ్డి, ఉపాధ్యక్షుడు  డాక్టర్ ప్రభాకర్, అడ్వకేట్ పాపారావు, క్రిస్టఫర్  తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఎం. రంగనాయక  సౌజన్యంతో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న  వైద్యులను లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్  ఆధ్వర్యంలో  లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు.

About Author