కర్నూలు జిల్లా స్థాయి ఆటల పోటీలలో రవీంద్ర విద్యార్థుల ప్రతిభ
1 min readస్థానిక అబాస్ నగర్ లోని రవీంద్ర విద్యానికేతన్ స్కూల్ విద్యార్థులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ ఒలంపిక్ డిస్టిక్ అసోసియేషన్ వారు నిర్వహించిన జిల్లా స్థాయి ఆటల పోటీలలో రవీంద్ర విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. రవీంద్ర బాలికల పాఠశాలఅండర్ 17 బాలికల విభాగంలో వాలీబాల్ నందు గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు.యోగా పోటీలలోసీ. సాకేత్,ఐదవ తరగతి, గోల్డ్ మెడల్ అండర్ 12.,సి.లిఖిత్, గోల్డ్ మెడల్ అండర్ 14, ఏడవ తరగతి మరియు చెస్ పోటీలలో జి. శ్రీరామ్, 8వ తరగతి, సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నారు. పాఠశాల వారు ఈ సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేశారు దీన్ని ఉద్దేశించి రవీంద్ర విద్యాసంస్థల అధినేత శ్రీ.జి. పుల్లయ్య మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు జిల్లా స్థాయి ఆటల పోటీలలో ప్రతిభ కనబరిచినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని, ఇదేవిధంగా వారు అహర్నిశలు కష్టపడితే ఉన్నత శిఖరాలకు ఎదగగలరని రాష్ట్రస్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచాలని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. యోగాని రోజువారి దినచర్యలో చేర్చుకోవడం వలన సగటు మనిషి మానసికంగా బలంగా ఉండగలరని చెప్పుకొచ్చారు.ఈ అభినందన సభలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.