PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహానందిలో ఘనంగా రెవెన్యూ డే

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  మహానందిలోని తాసిల్దార్ కార్యాలయంలో ఘనంగా మొట్టమొదటి రెవెన్యూ డేను గురువారం నిర్వహించారు. తాసిల్దార్ రామచంద్రుడు ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు నిర్వహించారు. తాసిల్దార్ రామచంద్రుని తో పాటు విశ్రాంత తాసిల్దార్ జనార్దన్ శెట్టి బుక్కాపురం గ్రామానికి చెందిన రైతు నాగరాజును రెవెన్యూ డే సందర్భంగా సిబ్బంది సన్మానించారు. తాసిల్దార్ రామచంద్రుడు మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థ ఏర్పడిన నాటి నుండి మొదటిసారిగా రెవెన్యూ డే ఉత్సవాలను జరుపుకోవడం ఆనందకరంగా ఉందన్నారు. ప్రజలకు రెవెన్యూ వ్యవస్థ తో విడదీయరాని బంధం ఏర్పడి ఉందన్నారు. డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి మనిషి పుట్టినప్పటి నుండి మరణించేవరకు రెవెన్యూ శాఖ సహాయ సహకారాలు ముడిపడి ఉన్నాయన్నారు. రెవెన్యూ సిబ్బంది ప్రజల అవసరాల నిమిత్తం కార్యాలయాలకు వస్తే వారికి సంబంధించిన ఫైళ్లను వెంటనే పరిష్కరించాలని పెండింగ్లో ఉంచవద్దని సూచించారు. సమస్య ఏదైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకొని పోయి త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలతో ఏ వ్యవస్థకులేని అనుబంధం రెవెన్యూ వ్యవస్థకు ఉందని గ్రామస్థాయి నుండి మండల, తాలూకా, జిల్లా స్థాయి వరకు రెవెన్యూ వ్యవస్థకు సిబ్బంది ఉందని ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. విశ్రాంత తహసిల్దార్ జనార్ధన్ శెట్టి మాట్లాడుతూ మొగల్ చక్రవర్తుల కాలం నుండి రెవెన్యూ వ్యవస్థ అమల్లో ఉందని గుర్తు చేశారు. ప్రస్తుతం రెవెన్యూ వ్యవస్థ గుండె లాంటిదని ఈ వ్యవస్థలో పనిచేస్తున్నామంటే గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం కేకును కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ సురేంద్ర నాథ్ రెడ్డి, ఆర్ ఐ శ్వేత సూపరిండెంట్ రామకృష్ణ వీఆర్వోలు చలమయ్య సురేంద్ర శివ వీఆర్ఏలు సిబ్బంది పాల్గొని గ్రూప్ ఫోటో దిగారు. 

About Author