యోగ క్రీడా అభివృద్ధికి పాటుపడుతాం
1 min readజిల్లా నుంచి జాతీయ స్థాయి పోటీలలో పతకాలు సాధించిన క్రీడాకారులకు ట్రాక్ సూట్ లో అందజేత .
జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతి రావు,జాతీయ యోగ సంఘం సంయుక్త కార్యదర్శి శ్రీధర్ రెడ్డి .
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రతిభగల యువ యోగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు యోగ సంఘం,డిఎస్ఏ కర్నూలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతి రావు,జాతీయ యోగ సంఘం సంయుక్త కార్యదర్శి శ్రీధర్ రెడ్డి లు అన్నారు.పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని బుధవారం కర్నూలు నగరంలోని డిఎస్ఏ యోగహాల నందు కర్నూలు జిల్లా నుంచి జాతీయ స్థాయి పోటీలలో పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రోత్సాహకంగా జిల్లా యోగా సంఘం తరఫున ట్రాక్ సూట్లను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా జిల్లాలో 100 కి పైగా క్రీడాకారులు పాల్గొని సత్తా చాటారా అని అన్నారు.అంతేకాకుండా 10 మంది క్రీడాకారులు ఇప్పటికే అంతర్జాతీయ పోటీల్లో సైతం పాల్గొని జిల్లా కీర్తిని ఇమ్మడింప చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యోగ సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి,జిల్లా యోగ సంఘం ప్రతినిధులు డాక్టర్ ముంతాజ్ బేగం, విజయ్ కుమార్,లోకేష్, శ్రీనివాసులు,చిన్న సుంకన్న,ఈశ్వర్ నాయుడు,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.