యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం : మోమిన్ షబానా
1 min readథెరీసా జూనియర్ కళాశాలలో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు
ముఖ్యఅతిథిగా బిజెపి నాయకురాలు మోమిన్ షబానా
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: పట్టణంలోని థెరీసా జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం థెరీసా జూనియర్ కళాశాలలో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి నాయకురాలు మోమిన్ షబానా హాజరై యోగా యొక్క ప్రాముఖ్యతను మరియు దాని వల్ల కలిగే ఫలితాలను విద్యార్థులకు వివరించారు. అనంతరం యోగా శిక్షకులు ఆధ్వర్యంలో కళాశాల ప్రిస్సిపిల్ వసుంధర , అధ్యాపకులు, విద్యార్థులు ఆసనాలు వేసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులతోపాటు అధ్యాపకురాలు కళాశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.