రవీంద్ర … జీ.పుల్లయ్య కళాశాలలో యోగా దినోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక వెంకయపల్లిలోని రవీంద్ర మరియుజీ. పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. యోగాలో వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నారు, విద్యార్థులు సూర్య నమస్కారాలు మరియు యోగాసనాలు చేసి యోగ పట్ల విద్యార్థుల అభిరుచిని చాటుకున్నారు. రవీంద్ర ప్రిన్సిపల్ డా||కే.ఈ. శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ యోగా అంతర్జాతీయ గుర్తింపు పొందడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కారణమని, ప్రపంచం మొత్తం యోగ పట్ల అవగాహన రావడానికి మోడీ ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు, అలాగేజి. పుల్లయ్య కళాశాల ప్రిన్సిపల్ డా||సి. శ్రీనివాసరావు మాట్లాడుతూ యోగ రోజువారి దినచర్యలో చేర్చుకోవడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు దరి చేరవని మనిషి ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలరని, యువత యోగాని ఎల్లప్పుడూ తమ దినచర్యలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం ప్రొఫెసర్ జి.శశికుమార్ దీన్ స్టూడెంట్ అఫైర్స్, మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎస్.శంకర్ ప్రసాద్ నిర్వాహకులుగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.